నాగసాధువులా మజాకా : ఆఫీసర్ ఉద్యోగం సాధించడమే ఈజీ

ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో నాగ సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి ఆహర్యం, రూపురేఖలు, ధైర్య సాహసాలు అన్నీ ప్రత్యేకమే. నాగ సాధువులుగా మారడం అంత

  • Published By: veegamteam ,Published On : January 27, 2019 / 08:26 AM IST
నాగసాధువులా మజాకా : ఆఫీసర్ ఉద్యోగం సాధించడమే ఈజీ

ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో నాగ సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి ఆహర్యం, రూపురేఖలు, ధైర్య సాహసాలు అన్నీ ప్రత్యేకమే. నాగ సాధువులుగా మారడం అంత

ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో నాగ సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి ఆహర్యం, రూపురేఖలు, ధైర్య సాహసాలు అన్నీ ప్రత్యేకమే. నాగ సాధువులుగా మారడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. నాగ సాధువుగా మారడం కన్నా ఓ ఆఫీసర్ ఉద్యోగం సాధించడమే ఈజీ. నాగ సాధువులుగా మారడం వెనక ఉన్న సాధన ఏంటో తెలిస్తే విస్తుపోవాల్సిందే.

 

సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ఆది శంకరాచార్యులు అఖాడాను ఏర్పాటు చేశారు. ఈ పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ అఖాడాలో సన్యాసిగా ప్రవేశం పొందడం అంత ఈజీ కాదు… సన్యాసిగా మారడానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. సన్యాసిగా మారాలనుకునేవారికి ముందుగా నియమాలన్ని తెలిసి ఉండాలి. ధైర్య సాహసాలను పరీక్షిస్తారు. కొన్నిసార్లయితే సన్యాసి కావడానికి పదేళ్లపాటు ఎదురు చూడాల్సి వస్తుంది. నాగ సాధువుగా మారడానికి ఆధార్‌ కార్డు, ఓటర్ ఐడి, ఓ మధ్యవర్తి కూడా అవసరం ఉంటుంది. వీరిపై రహస్యంగా విచారణ జరిపి… అన్ని స్టేజీలలో సఫలమయ్యాకే నాగ సన్యాసిగా దీక్ష ఇస్తారు.

 

నాగసాధువుల శిక్షణ దేశాన్ని రక్షించే సైనికుల మాదిరే ఉంటుంది. సైనికులు దేశ రక్షణ కోసం పోరాడితే…నాగ సాధువులు ధర్మాన్ని రక్షించేందుకు తమ జీవితాన్ని త్యాగం చేస్తారు. నాగ సాధవులకు శాస్త్రాలతో పాటు అస్త్ర శస్త్ర విద్యలల్లో కూడా శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత శాస్త్రమా…లేక శస్త్ర విద్యల్లో ఏదో ఒకటి ఎంచుకుని అదే మార్గంలో వారు వెళ్లాల్సి ఉంటుంది. బాగా చదువుకున్న సన్యాసులు భాగవత కథలు, ప్రవచనాలతో ప్రజలను జాగృతం చేస్తుంటారు.

 

సైనిక సన్యాసులు అఖాడాలోనే ఉంటూ శిక్షణ పొందుతారు. వీరికి మార్షల్ ఆర్ట్‌ తరహా శిక్షణ ఇస్తారు. ధర్మ రక్షణ కోసం నాగ సాధువులు తమ వెంట ఓ ఆయుధాన్ని కలిగి ఉంటారు. నేర ప్రవృతి కలిగిన నాగ సాధువులను నిలిపివేసేందుకు 2 వేల సంవత్సరంలో చెకింగ్‌ సిస్టమ్ తెచ్చారు. కొత్తగా నాగసాధువులుగా చేరే వారి పూర్తి వివరాలను సేకరిస్తారు. అనంతరం వారిని అఖాడాలో చేర్చుకుంటారు. నాగ సాధువులు అలంకరణకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. మహిళలు 16 రకాలుగా అలంకరించుకుంటే.. నాగ సన్యాసులు 17 రకాలుగా మేకప్‌ చేసుకుంటారు. భస్మం పెట్టుకోవడమే సన్యాసులకు అతిముఖ్యమైన ఆభరణం. దీంతో పాటు రుద్రాక్షలు, కాటుక, హారం, తదితర వస్తువులతో వీరు అలంకరణ చేసుకుంటారు. చలి, వేడి, వర్షం…అన్నింటిని తట్టుకునేలా వారు శిక్షణ పొందుతారు.