అంగస్తంభన సమస్య శారీరక, మానసిక కారణాల వల్ల ఏర్పడుతుంది. వీటిలో కూడా 60 శాతం శారీరక కారణాలు, 40 శాతం మానసిక కారణాలుగా చెప్పవచ్చు. అంగస్తంభనను ఎరిక్టైల్ డిస్ ఫంక్షన్ అని అంటారు. ఈ ఎరిక్షన్ కేవలం పనల్ ఎరిక్షన్ మాత్రమే కాదు, ఎరిక్షన్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ సమయంలో ఎక్కువ సమయం ఉండకపోవడం కూడా అంగస్తంభన లోపంగానే గుర్తించాలి.
ఈ పరిస్థితి 40 ఏళ్ళు పైబడ్డ వారిలో సహజం. అంగస్తంభనకు మరికొన్ని అసాధారణ కారణాలు కూడా ఉన్నాయి. వాటిలో స్ట్రెస్, హార్మోనుల అసమతుల్యతలు, మానసిక ఆందోళన ఒత్తిడి, భయం, డిప్రెషన్, పెర్ఫార్మెన్స్ యాంగ్జయిటీతో బాధపడుతున్నవారికి వారి సెక్స్ సామర్థ్యం పైన నమ్మకం లేనందున అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది.
అయితే పొట్ట ఎక్కువగా ఉండడం కూడా అంగస్తంభనకి కారణం అవుతుంది. బీర్ బెల్లీ ఉన్న మధ్య వయస్కులైన పురుషులు ‘అంగస్తంభన పొందడంలో కష్టపడే అవకాశం ఉంది’. అధిక బొడ్డు కొవ్వు ప్రదర్శించడానికి అవసరమైన రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది మరియు టెస్టోస్టెరాన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది, టర్కిష్ పరిశోధకులు జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్‌లో ఈ విషయాన్ని సూచిస్తున్నారు.
“బెల్లీ ఫ్యాట్ టెస్టోస్టెరాన్‌ను ఈస్ట్రోజెన్ గా మారుస్తుంది, తద్వారా సరైన హార్మోన్ల సమతుల్యతకు అంతరాయం కలుగుతుంది. అంగస్తంభనకు కొన్ని అసాధారణమైన కారణాలు కూడా ఉన్నాయి. పడకగదిలో పార్ట్‌నర్‌ను సంతోషపరచడానికి వేరే మార్గం ఉండదు కాబట్టి అంగస్తంభన సమస్యకు చికిత్స తీసుకోవడం కచ్చితంగా అవసరం. కొన్ని సందర్భాల్లో పురుషున్ని మానసికంగా ఫ్రస్టేషన్‌లోకి దిగజార్చుతుంది. అగస్తంభన సమస్యతో బాధపడేవారు మానసిక ఒత్తిడికి లోనుకావడం, వారిలో ఆత్మవిశ్వాసం తగ్గడం, డిప్రెషన్‌తో బాధపడటం జరుగుతుంది. అంగంలోకి రక్తప్రసరణ జరగపోవడం అన్నది అంగస్తంభన సమస్యకు ముఖ్యమైన కారణం.
అంగస్తంభన సమస్యకు మరికొన్ని కారణాలు:
పోర్న్ మూవీస్ ఎక్కువగా చూడటం:
ఒంటరిగా ఉన్నప్పుడు పోర్నోగ్రఫీ ఎక్కువగా చూడటం అంగస్తంభన సమస్యకు కారణం అవుతుంది. వీటి కారణంగా పార్ట్నర్ ను సరైన సమయంలో సుఖపెట్టలేరు.
ఫ్లాసింగ్ (పాచీ తియ్యకపోవడం): దంతాల్లో పాచి తొలగించకపోతే, ఇది నైట్రిక్ యాసిడ్స్ తగ్గిస్తుంది, ఇది జెనిటల్ పార్ట్స్‌కు రక్తప్రసరణను మెరుగుపరిచే ఎంజైమ్. ఇది తగ్గిపోవడం వల్ల అంగస్తంభన లోపాలు ఏర్పడుతాయి.
ఉప్పు ఎక్కువగా తినడం: రెగ్యులర్‌గా రోజూ సాల్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల ధమనుల్లో జెనటిల్స్‌కు రక్తప్రసరణ తగ్గుతుంది. దాంతో అంగస్తంభన లోపాలు పెరుగుతాయి.