Srabanti Chatterjee: బీజేపీకి షాక్.. నటి స్రబంతి రాజీనామా!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీకి అక్కడ పరిస్థితి దయనీయంగా మారిపోయింది.

Srabanti Chatterjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీకి అక్కడ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. రాష్ట్రంలో బీజేపీలో చీలికల వస్తున్నాయి. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన పలువురు నేతలు ఇప్పుడు బీజేపీని వీడుతున్నట్లు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీ కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఈ ఏడాది మార్చి 2న స్రబంతి ఛటర్జీ బీజేపీలో చేరారు. బెంగాల్ అభివృద్ధిపై కాషాయ పార్టీకి ఎలాంటి చిత్త‌శుద్ధి, ప్లానింగ్ లేదని, అందుకే పార్టీని వీడుతున్నాన‌ని స్ర‌వంతి ఛ‌ట‌ర్జీ స్ప‌ష్టం చేశారు. స్ర‌వంతి ఛ‌ట‌ర్జీ టీఎంసీలో చేరుతార‌నే ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి.

గంజాయిని ఇంటి పంటగా మార్చేసిన ఘనుడు! _ Hyderabad

అంతకుముందు బీజేపీలో చేరిన సమయంలో బెంగాల్‌లో అభివృద్ధి చేస్తామని స్రబంతి ఛటర్జీ హామీ ఇవ్వడం గమనార్హం. అప్పట్లో మమతా బెనర్జీని నేను గౌరవిస్తానని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత నన్ను మరింతగా ఆకట్టుకుందని ఆమె అన్నారు. వామపక్షాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌ హయాంలో బెంగాల్‌ అభివృద్ధి చెందాల్సినంత అభివృద్ధి చెందలేదని, అందుకే బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.

Assam Road Accident: ఛట్ పూజకు వెళ్లి వస్తుండగా ప్రమాదం..10మంది మృతి

పశ్చిమ బెంగాల్‌లోని బెహలా పశ్చిమ స్థానం నుంచి బీజేపీ తరపున స్రబంతి ఛటర్జీ పోటీ చేయగా.. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పార్థ ఛటర్జీ చేతిలో ఓడిపోయింది. అయితే, అక్కడ స్రబంతి టైట్ ఫైట్ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు