Assam Road Accident: ఛట్ పూజకు వెళ్లి వస్తుండగా ప్రమాదం..10మంది మృతి

ఛట్ పూజకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగి 10మంది మృతి చెందిన ఘటన అస్సాంలో జరిగింది. మృతుల్లో చిన్నారులు,మహిళలే ఎక్కువమంది ఉన్నారని పోలీసులు తెలిపారు.

Assam Road Accident: ఛట్ పూజకు వెళ్లి వస్తుండగా ప్రమాదం..10మంది మృతి

Assam Road Accident

Assam Road Accident: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవిచింది. రోజు తెల్లవారకముందే ప్రాణాలు గాల్లో కలిసిపోయారు. కార్తీక మాసం సందర్భంగా ఛట్ పూజలో పాల్గొని తిరిగి వస్తుండగా సంభవించిన ప్రమాదంలో 10మంది ప్రాణాలు అనంతలోకాల్లో కలిసిపోయారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. గురువారం ఉదయం (నవంబర్ 11,2021) కరీమ్గంజ్‌ జిల్లాలో ఆటోను ఓ ట్రక్కు వేగంగా ఢీకొనటంతో 10 మంది మృతి చెందారు. చట్‌ పూజల్లో పాల్గొని తిరిగి స్వస్థలాలకు వెళుతుండగా.. జాతీయ రహదారి 8పై ప్రమాదం చోటుచేసుకుంది.

Read more : Bus Accident: నడిరోడ్డుపై బస్సు దగ్ధం.. 12మంది సజీవ దహనం

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు..హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాచక చర్యలు చేపట్టారు. త్రిపుర సరిహద్దుల సమీపంలోని ఎనిమిదో నెంబర్‌ జాతీయ రహాదారి దగ్గర వేగంగగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టి అంతే వేగంగా అక్కడ నుంచి దూసుకుపోయింది.

Read more : Assam : 10 మంది చావుకు కారణమైన లారీ డ్రైవర్

కాగా..బిహార్‌, జార్ఖండ్ స‌హా ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగిపోతారు. ఛట్ పూజ సంద‌ర్భంగా ఉద‌యం నుంచే న‌దుల వ‌ద్ద పుణ్య‌స్నానాలు ఆచరించి సూర్య భ‌గ‌వానుడికి ప్ర‌త్యేక‌పూజ‌లు నిర్వ‌హిస్తారు. సాధార‌ణంగా దీపావ‌ళి పండుగ పూర్త‌యిన ఆరు రోజుల త‌ర్వాత ఈ పండుగను జ‌రుపుకుంటారు. నాలుగు రోజుల పాటు జ‌రుపుకునే ఈ పండుగలో భాగంగా 36 గంట‌ల పాటు ఉప‌వాసం ఉంటారు. న‌దీ ఘాట్‌ల వ‌ద్ద స్నానం ఆచ‌రించి.. అక్క‌డే దీపాల‌ను వెలిగించి పూజ‌లు చేస్తారు. ఈ క్రమంలో చట్ పూజకు వెళ్లి వస్తుండగా అస్సాంలో జరిగిన ప్రమాదంలో 10మంది మృతి చెందారు.