Bengal : ఆటోలో ఉచితంగా జర్నీ చేయవచ్చు..కానీ డ్రైవర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

ఆర్థిక ఇబ్బందుల కారణంగా..తాను ఎక్కువ చదువుకోలేదని..కేవలం ఆరో తరగతి వరకు చదువుకున్న తాను...ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటల వరకు చదివే అలవాటు ఉందని వెల్లడించాడు.

Bengal E-rickshaw Driver : తన ఆటోలో ఉచితంగా జర్నీ చేయవచ్చని, డబ్బులు అస్సలు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నా ఓ ఆటోవాలా. కానీ..ఓ కండీషన్ మాత్రం పెడుతున్నాడు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం మాత్రం చెప్పాలంటున్నాడు. ఒకవేళ సరైన సమాధానం చెప్పకపోతే…అధిక ఛార్జీలు వసూలు చేద్దామని ఇలా చేస్తున్నాడు. కొంతమంది అసలు ఏ ప్రశ్నలు అడుగుతాడో తెలుసుకుందామని ఆటోను ఎక్కుతున్నారంట. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం బయటపడింది.

Read More : Kejriwal Promises : ప్రతి మహిళకు నెలకు రూ. 1000, ప్రపంచంలోనే అతిపెద్ద పథకం

పశ్చిమ బెంగాల్ లో సురంజన్ కర్మాకర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సంకలన్ సర్కార్ దంపతులు ఇతని ఆటో ఎక్కడానికి ప్రయత్నిస్తారు. తాను అడిగే ప్రశ్నలకు జవాబులు చెబితే ఫ్రీగానే తీసుకెళుతానని చెబుతాడు కర్మాకర్. కొంత షాక్ కు గురైన ఆ జంట..ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో తెలుసుకుందామని ఆటో ఎక్కుతారు. జీకేలోని అన్నింటినీ అడుగుతూ వెళుతాడు. క్విజ్ అయిపోయిన తర్వాత..సురంజన్ గురించి అడిగి తెలుసుకుంటాడు సంకలన్ సర్కార్.

Read More : Elon Musk : కస్టమర్ కంప్లెయింట్ కి 3 నిమిషాల్లోనే టెస్లా సీఈవో రిప్లై..నెటిజన్ల ప్రశంసలు

ఆర్థిక ఇబ్బందుల కారణంగా..తాను ఎక్కువ చదువుకోలేదని..కేవలం ఆరో తరగతి వరకు చదువుకున్న తాను…ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటల వరకు చదివే అలవాటు ఉందని వెల్లడించాడు. లిలుయా బుక్ ఫేయిర్ ఫౌండేషన్ కి తాను సభ్యుడిగా ఉన్నట్లు తెలిపారు. సంకలన్ సర్కార్ ఇతని గురించి ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. అతను ఏ ఏ ప్రశ్నలు అడిగాడో కూడా అందులో పొందుపరిచారు. నెటిజన్లు ఆటోవాలాను ప్రశంసిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు