Elon Musk : కస్టమర్ కంప్లెయింట్ కి 3 నిమిషాల్లోనే టెస్లా సీఈవో రిప్లై..నెటిజన్ల ప్రశంసలు

దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ "టెస్లా"సీఈవో ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తరుచుగా ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో కూడా ఆయన మాట్లాడుతుంటా

Elon Musk : కస్టమర్ కంప్లెయింట్ కి 3 నిమిషాల్లోనే టెస్లా సీఈవో రిప్లై..నెటిజన్ల ప్రశంసలు

Musk

Elon Musk :  దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ “టెస్లా”సీఈవో ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తరుచుగా ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో కూడా ఆయన మాట్లాడుతుంటారు. అయితే తాజాగా ఓ కస్లమర్ ట్వీట్ కు కేవలం 3 నిమిషాల్లోనే రిప్లై ఇచ్చిన టెస్లా సీఈవోపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. అయితే ఇంతకీ అసలు ఆ కస్లమర్ చేసిన ట్వీట్ ఏంటీ? దానికి ఎలాన్ మస్క్ ఇచ్చిన సమాధానం ఏంటీ? చూద్దాం.

దక్షిణకొరియాకు చెందిన “జైహవాన్ చో” అనే వ్యక్తి ఇటీవల ఓ టెస్లా మోడల్ 3 కారుని కొనుగోలు చేశాడు. అయితే చాలా మంది టెస్లా యజమానులు తమ వాహనాలను కీ(తాళం) ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే కంపెనీ యాప్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే టెస్లా యాప్ లో సమస్యల కారణంగా గత శనివారం జైహవాన్ తన కారను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది ఎదుర్కొన్నాడు. దీంతో వెంటనే అతడు ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. “దక్షిణ కొరియాలోని సియోల్‌లోని నా iOS యాప్‌లో నా టెస్లా మోడల్ 3ని కనెక్ట్ చేయడంలో నేను 500 సర్వర్ ఎర్రర్‌ను ఎదుర్కొంటున్నాను. ఇది ప్రపంచవ్యాప్త సమస్యగా కనిపిస్తోంది”అని ఎలాన్ మస్క్ పేరును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు జైహవాన్.

జైహవాన్ ఫిర్యాదుపై కేవలం 3 నిమిషాల్లోనే ఎలాన్ మస్క్ స్పందించారు. “చెకింగ్” అంటూ జైహవాన్ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు మస్క్. దాదాపు 5 గంటల తర్వాత, యాప్ సమస్యపై అప్‌డేట్‌ తో తిరిగివచ్చారు ఎలాన్ మస్క్. యాప్‌లో జరిగిన తప్పు గురించి ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు. “ఇప్పుడు మళ్లీ ఆన్‌లైన్‌లోకి వచ్చింది. మేము అనుకోకుండా నెట్‌వర్క్ ట్రాఫిక్ యొక్క వెర్బోసిటీని పెంచినట్లు కనిపిస్తోంది. క్షమాపణలు, మళ్లీ ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటాం’’ అని మస్క్ ట్వీట్ చేశారు. అయితే ఎలాన్ మస్క్ ఇంత వేగంగా స్పందించి కస్టమర్ల సమస్యను పరిష్కరించండపై మస్క్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జైహవాన్ చో కూడా టెస్లా బాస్‌కి ‘ధన్యవాదాలు, ఎలాన్’ అని ట్విట్టర్ లో బదులిచ్చారు.

ALSO READ Jeff Bezos : కొన్నేళ్ల తర్వాత మనిషి పుట్టుక అంతరిక్షంలోనే..పర్యాటక ప్రదేశంగా భూమి!