Jeff Bezos : కొన్నేళ్ల తర్వాత మనిషి పుట్టుక అంతరిక్షంలోనే..పర్యాటక ప్రదేశంగా భూమి!
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనిషి తర్వాతి తరాల పుట్టుక అంతరిక్షంలోనే ఉండబోతుందంటున్నారు జెఫ్ బెజోస్. భవిష్యత్తులో భూమి ఒక పరిరక్షణ నేషనల్ పార్క్ గా ఉంటుందని,

Bezos
Jeff Bezos అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనిషి తర్వాతి తరాల పుట్టుక అంతరిక్షంలోనే ఉండబోతుందంటున్నారు జెఫ్ బెజోస్. భవిష్యత్తులో భూమి ఒక పరిరక్షణ నేషనల్ పార్క్ గా ఉంటుందని, విశ్వ పర్యాటక ప్రదేశంగా కూడా మారిపోవచచ్చన్నారు.
గతవారం ఇగ్నాటియస్ ఫోరమ్ 2021లో ‘స్పేస్ ట్రావెల్, భవిష్యత్తులో దాని సామర్థ్యం’ అంశం మీద జెఫ్ బెజోస్ ప్రసంగించారు. జెఫ్ బెజోస్ మాట్లాడుతూ..”కొన్ని వందల సంవత్సరాలు తర్వాత మనిషి పుట్టేది అంతరిక్షంలోనే. అక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని మనిషి బతుకుతుంటాడు. అప్పటికి భూమి ఒక పరిరక్షక గ్రహంగా ఉంటుంది. భూమిని చూసేందుకు మనిషి టూరిస్టుగా మారిపోతాడు. కాబట్టి, భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
భూమి ఎంతో విలువైన గ్రహం. కోట్లలో పెరుగుతున్న జనాభాతో భూమ్మీద ఒత్తిడి ఉంటోంది. ఈ కారణంతోనే రాబోయే రోజుల్లో వృక్ష, జంతు సంపద తగ్గిపోవడం ఖాయ కాబట్టి, పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు నివాసయోగ్యమైన ప్రాంతం వెతుక్కోవడంలో తప్పేముంది. అంగారకుడి లాంటి గ్రహాల మీద జీవనం ఏర్పరుచుకోవడం వల్ల భూమి భారాన్ని తగ్గించవచ్చు. విలువైన జీవన సంపదతో కూడిన అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా భూమిని తీర్చిదిద్దుకోవచ్చు. అందుకు బీజం వేసిది స్పేస్ టూరిజమే’’ అని బెజోస్ ప్రసంగించారు.
ALSO READ Seerat Kapoor: చూపులతో మాయచేయగల ముంబై భామ సీరత్!