Kejriwal Promises : ప్రతి మహిళకు నెలకు రూ. 1000, ప్రపంచంలోనే అతిపెద్ద పథకం

ప్రపంచంలోనే అతిపెద్ద పథకం అన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఈ పథకం మాత్రం అధికారంలోకి వస్తే...తాము అమలు చేయడం జరుగుతుందని...

Kejriwal Promises : ప్రతి మహిళకు నెలకు రూ. 1000, ప్రపంచంలోనే అతిపెద్ద పథకం

Punjab Aap

Mission Punjab : 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు తాము నెలకు రూ. 1000 ఆర్థిక సాయం అందిస్తామని, ప్రపంచంలోనే అతిపెద్ద పథకం అన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఈ పథకం మాత్రం అధికారంలోకి వస్తే…తాము అమలు చేయడం జరుగుతుందని, కుటుంబసభ్యులను డబ్బులు అడగకుండా..వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ పథకం ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. త్వరలో..కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఆప్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఢిల్లీలోనే కాకుండా..ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని ఆప్ పక్కా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా పంజాబ్ పై దృష్టి సారించింది.

Read More : Somu Veerraju : కోర్టు నుంచి తప్పించుకునేందుకే 3 రాజధానుల బిల్లు వెనక్కి

పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లాకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేరుకున్నారు. అక్కడ సీఎం చరణ్ జిత్ సింగ్ పై విమర్శలు గుప్పించారు. పంజాబ్ లో ఎన్నికలకు సంబంధించి ఆప్ ప్రకటించిన ఎన్నికల హామీలను ఆయన కాపీ కొట్టారని ఎద్దేవా చేశారు. నకిలీ వ్యక్తి జనాల మధ్య తిరుగుతున్నారని, పంజాబ్ ప్రజలకు ఇచ్చిన..హామీలను రెండు రోజుల తర్వాత…వాటినే తమ పార్టీ హామీలను సీఎం చరణ్ జిత్ ప్రకటించారని తెలిపారు. రాష్ట్రంలో ఆప్ కు అధికారం కట్టబెట్టాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వస్తే..18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1000 అందిస్తామని..ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్దదిగా అభివర్ణించారు.