Somu Veerraju : కోర్టు నుంచి తప్పించుకునేందుకే 3 రాజధానుల బిల్లు వెనక్కి

మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. వికేంద్రీకరణ అంశంపై కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే..

Somu Veerraju : కోర్టు నుంచి తప్పించుకునేందుకే 3 రాజధానుల బిల్లు వెనక్కి

Somu Veerraju

Somu Veerraju : మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. వికేంద్రీకరణ అంశంపై కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే బిల్లు వెనక్కి తీసుకున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు
సంధించారు. అధికార వికేంద్రీకరణ వారి సొత్తు కాదని ఆయన స్పష్టం చేశారు. వికేంద్రీకరణ బీజేపీ కూడా చేసిందని, కొత్త రాష్ట్రాలు తీసుకొచ్చిందని వివరించారు. ఒక విధానం ప్రకారం బీజేపీ వికేంద్రీకరణ చేపట్టిందని తెలిపారు. కానీ, రోడ్డుపై గోతులు పూడ్చలేని వారు అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Amaravathi : రాజధాని అంశంపై సీఎం జగన్ సంచలన ప్రకటన..మళ్లీ బిల్లు తీసుకొస్తాం

అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే రాజధాని అని సీఎం జగన్ గతంలో చెప్పిన మాటకు సమాధానం ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తాను చెప్పిన మాటకు జగన్ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణపై మాట్లాడే హక్కు జగన్ కు లేదని అన్నారు. విశాఖను ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. రాజధానులపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అన్ని పార్టీలతో చర్చించాలని, ప్రజాభిప్రాయం సేకరించాలని హితవు పలికారు.

మూడు రాజధానుల ఉపసంహరణ నిర్ణయం ప్రభుత్వ విధాన నిర్ణయంగా భావిస్తున్నామని సోము వీర్రాజు అన్నారు. ప్రజా రాజధాని అభివృద్ధికి బీజేపీ నిబద్ధతతో ఉందని తెలిపారు. కాగా, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమ అభివృద్ధి చెందకపోవడానికి ఆ ప్రాంత పాలకులే కారణమని ఆయన అన్నారు. నేతలు వనరులను దోచుకుంటున్నారని మండిపడ్డారు.

రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు సోము వీర్రాజు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

Blood Flow : శనగలు తింటే శరీరంలో రక్తం పెరుగుతుందా…

మూడు రాజధానుల బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎం జగన్‌ అసెంబ్లీలో ప్రకటన చేశారు. అయితే, మూడు రాజధానుల అంశంలో మార్పు లేదని, కొన్ని మార్పులతో మళ్లీ కొత్త బిల్లు తీసుకొస్తామన్నారు. ప్రస్తుతానికి వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను వెనక్కి తీసుకుంటున్నామని వెల్లడించారు. విస్తృత, విశాల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అయితే మూడు రాజధానులపై తమ నిర్ణయం మారదని, ఈ బిల్లును మరింత మెరుగుపరిచి, సమగ్రమైన బిల్లుగా ముందుకు తెస్తామని సీఎం జగన్ చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలకు సంపూర్ణంగా వివరించేలా బిల్లును నవీకరిస్తామని తెలిపారు. కొత్త బిల్లుపై అన్ని వర్గాల ప్రజలను ఒప్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చట్టపరంగా, న్యాయపరంగా అన్ని సందేహాలకు ఈ కొత్త బిల్లు ద్వారా సమాధానమిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.