Bengaluru : చెత్తకుప్పలో బయటపడ్డ అమెరికా డాలర్ల నోట్ల కట్టలు .. తీసుకెళ్లి యజమానికి అప్పగించిన వ్యక్తి

బెంగళూరులోని ఓ చెత్తకుప్పలో భారీగా అమెరికన్ డాలర్ల నోట్ల కట్టలు కలకలం రేపాయి. ఓవ్యక్తి చెత్త ఏకుంటుండగా కరెన్సీ నోట్ల కట్టలతో ఉన్న ఓ బ్యాగ్ కనిపించింది.

US Dollars Bundles in Bengaluru garbage : బెంగళూరులోని ఓ చెత్తకుప్పలో భారీగా అమెరికన్ డాలర్ల నోట్ల కట్టలు తీవ్ర కలకలం రేపాయి. ఓవ్యక్తి చెత్త ఏకుంటుండగా కరెన్సీ నోట్ల కట్టలతో ఉన్న ఓ బ్యాగ్ కనిపించింది. అది చూసిన అతనికి కంగారుపుట్టింది. ఒకటి రెండు కాదు ఏకంగా రూ.25 కోట్ల విలువైన అమెరికన్ డాలర్ల కట్టలు కనిపిచంటంతో ఖంగుతిన్నాడు.

సల్మాన్ షేక్ అనే వ్యక్తి చెత్త సేకరిస్తుంటాడు. దాని కోసం నగర శివార్లలో కూడా తిరుగు చెత్త సేకరిస్తుంటాడు. దీంట్లో భాగంగా నవంబర్ 1న కూడా బెంగళూరు నగర శివారులో చెత్త ఏరుతుండగా అతనికి ఓ బ్యాగ్ కనిపించింది. దాంతో ఆసక్తిగా తీసి చూశాడు. దాంట్లో అమెరికన్ డాలర్ల కట్టలు కనిపించాయి. కంగారుపడిన అతను ఆ బ్యాగ్ ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికెళ్లి బ్యాగ్ విప్పి చూడగా దాంట్లో 23 అమెరికల్ డాలర్ల కట్టలు కనిపించాయి. దీంతో అతను నవంబర్ 5న తన యజమాని బొప్పాకు ఆ బ్యాగ్ అప్పగించాడు.

Electric Air Taxi : ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు ఎగరనున్నాయి…2026వ సంవత్సరంలో ప్రయాణికులకు సేవలు

బొప్పా స్థానికంగా ఉండే కలిముల్లాను ఈ విషయం చెప్పాడు. దాంతో వారిద్దరు ఆ బ్యాగ్ ను పోలీసులకు ఈ విషయం గురించి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అలా బొప్పా, కలిముల్లా ఇద్దరు కలిసి బెంగళూరు పోలీసు కమిషనర్‌ బి. దయానంద్ కు విషయం చెప్పి బ్యాంగ్ అందజేశారు.

దీంతో..ఆయన దర్యాప్తుకు ఆదేశించారు. ఆ నోట్ల కట్టలను పరిశీలించగా వాటిపై రసాయనాలు పూసినట్లుగా గుర్తించారు. బ్లాక్ డాలర్ స్కామ్‌కు పాల్పడుతున్న ముఠాకు చెందిన వారు ఈ నోట్లను చెత్తలో పడేసి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ డాలర్లు నకిలీవో కాదో తేల్చేందుకు పోలీసులు వీటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు