Online Delivery: ఆన్‌లైన్‌లో కాఫీ ఆర్డర్ చేసిన కస్టమర్: డెలివరీ బాయ్ చేసిన పనికి షాక్

వీధి చివరలో కాఫీ షాపు ఉన్నా అక్కడి వరకు వెళ్లి తాగలేని ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయగా..డెలివరీ బాయ్ చూపించిన అతి తెలివికి ఆ కస్టమర్ షాక్ అయ్యాడు

Online Delivery: టెక్నాలజీ పుణ్యమా అని ఎక్కడంటే అక్కడే మనకు కావాల్సిన వస్తువులు ఆర్డర్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అయితే మరీ చిన్న చిన్న అవసరాలకు కూడా ఆన్ లైన్ డెలివరీని ఉపయోగించుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలిపే ఘటన ఇది. వీధి చివరలో కాఫీ షాపు ఉన్నా అక్కడి వరకు వెళ్లి తాగలేని ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయగా..డెలివరీ బాయ్ చూపించిన అతి తెలివికి ఆ కస్టమర్ షాక్ అయ్యాడు. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి తన స్నేహితుడితో జరిపిన వాట్సాప్ సంభాషణ ప్రకారం..నగరంలోని ఒక ప్రముఖ కాఫీ షాప్ నుంచి ఆన్‌లైన్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారా ఒక కాఫీ ఆర్డర్ చేశాడు కస్టమర్. కాఫీ షాప్ సిబ్బంది ఆ ఆర్డర్‌ను అంగీకరించగా..ఆర్డర్ కలెక్ట్ చేసుకునేందుకు స్విగ్గి డెలివరీ బాయ్ అక్కడకు వెళ్ళాడు.

Also read:Power Crisis: దేశవ్యాప్తంగా 1,100 రైళ్లు రద్దు.. మే 24వరకు ఇదే పరిస్థితి.. ఎందుకంటే?

కాఫీ పార్సెల్ తీసుకున్న అతను..ఆ ఒక్క చిన్న డెలివరీ కోసం వినియోగదారుడి లొకేషన్ వరకు ఏం వెళ్ళాలి అనుకున్నాడో మరి..మరో డెలివరీ యాప్ డుంజో(DUNZO) ద్వారా ఆ కాఫీని సదరు వినియోగదారుడికి పార్సెల్ చేశాడు. అనంతరం వినియోగదారుడికి కాల్ చేసిన స్విగ్గి డెలివరీ బాయ్..’సార్ మీ పార్సెల్‌ను డుంజోలో పంపించాను.. నాకు మాత్రం 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి” అంటూ విజ్ఞప్తి చేశాడు. స్విగ్గిలో ఆర్డర్ చేసిన తన కాఫీ, డుంజో డెలివరీ బాయ్ తీసుకురావడంతో వినియోగదారుడు ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని తన మిత్రుడితో వాట్సాప్ ద్వారా పంచుకోగా..ఆ సంభాషణ తాలూకు స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది చూసిన నెటిజన్లు..స్విగ్గీ డెలివరీ బాయ్ అతితెలివిని ప్రశంసించడం గమనార్హం. బెంగళూరులో వ్యవహారాలు ఇలా పీక్స్‌లోనే ఉంటాయి మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:Kedarnath Temple: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు: కరోనా ఆంక్షల నడుమ భక్తులకు అనుమతి

ట్రెండింగ్ వార్తలు