Power Crisis: దేశవ్యాప్తంగా 1,100 రైళ్లు రద్దు.. మే 24వరకు ఇదే పరిస్థితి.. ఎందుకంటే?

దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం తీవ్రతరమవుతుంది. వేసవి ఎండలు విపరీతంగా పెరుగుతుండటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. అయితే అందుకు తగ్గ విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. బొగ్గు కొరత కారణంగా..

Power Crisis: దేశవ్యాప్తంగా 1,100 రైళ్లు రద్దు.. మే 24వరకు ఇదే పరిస్థితి.. ఎందుకంటే?

Power Plants

Power Crisis: దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం తీవ్రతరమవుతుంది. వేసవి ఎండలు విపరీతంగా పెరుగుతుండటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. అయితే అందుకు తగ్గ విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. బొగ్గు కొరత కారణంగా పలు ప్రాంతాల్లో పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించుకుంటు న్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఇందుకు మరింత ఆజ్యంపోసింది. అధిక ఇంధన ధరలను ప్రభుత్వం పరిష్కరిస్తున్న సమయంలో ఆర్థిక పునరుద్ధరణకు ముప్పు వాటిల్లుతోంది. అయితే ప్రధానంగా బొగ్గు ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణంగా భావించిన కేంద్రం.. విద్యుత్ కేంద్రాలకు బొగ్గు తరలింపులో వేగం పెంచింది. దీనికోసం గూడ్స్ రైళ్ల ట్రిప్పులను రైల్వే శాఖ అధికం చేసింది. ఈ క్రమంలో గూడ్స్ రైళ్లకు ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా వివిధ రూట్లకు వెళ్లాల్సిన ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. వీటిలో 500 ట్రిప్పులు మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు, 580 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఈ నెల 24వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది.

Power Crisis: విద్యుత్ సంక్షోభం మ‌రింత తీవ్ర‌త‌రం

అనేక రాష్ట్రాల్లో విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్న కారణంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ క్రమంలో బొగ్గును వేగంగా తరలించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత భారతీయ రైల్వే సుమారు 650 ట్రిప్పులను రద్దు చేసింది. అయితే రోజురోజుకు విద్యుత్ సంక్షోభం తీవ్రతరం అవుతుండటంతో గూడ్స్ రైళ్ల ద్వారా బొగ్గు తరలింపులో వేగంగా పెంచింది. బొగ్గు రవాణాకు “యుద్ధప్రాతిపదికన” చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ ప్రయత్నిస్తోందని, అలాగే విద్యుత్ ప్లాంట్లకు బొగ్గును వేగంగా తరలించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు గతంలోనే చెప్పారు.

Power Crisis: విద్యుత్ సంక్షోభం మ‌రింత తీవ్ర‌త‌రం

ఇందలా ఉంటే బకాయి బిల్లులు భారీ బొగ్గు సంక్షోభానికి తోడయ్యాయి. దాదాపు ₹ 7,918 కోట్ల విలువైన ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి కంపెనీల బకాయిల కారణంగా మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి అధిక బకాయిలున్న రాష్ట్రాలకు బొగ్గు తక్కువ పంపిణి జరిగిందని తెలుస్తుంది. అంతేకాకుండా ఉత్తరాఖండ్, గుజరాత్, ఢిల్లీ తమ గ్యాస్ ఆధారిత ప్లాంట్‌లతో ముందస్తు ఏర్పాట్లు చేయలేదని, ఇది సుమారు 4,000 మెగావాట్ల సామర్థ్యాన్ని ప్రభావితం చేసిందని, దేశీయ బొగ్గుపై మరింత ఒత్తిడి తెచ్చిందని కేబినెట్ సెక్రటరీకి నోట్‌లో పేర్కొంది. భారతదేశంలో 70 శాతం విద్యుత్ బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతుంది. క్యారేజీలు లేకపోవడంతో ఎక్కువ దూరం బొగ్గును తీసుకెళ్లడం కష్టంగా మారింది. ప్యాసింజర్ రైళ్లతో రద్దీగా ఉండే మార్గాలు తరచుగా బొగ్గు రవాణాకు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థలకు వేగంగా బొగ్గును ఉత్పత్తి చేసేందుకు ప్యాసింజర్ రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది.