బెంగుళూరే బెస్ట్ సిటీ, హైదరాబాద్ మనసుదొచుకొందంటున్న ఐటీ ప్రొపెషనల్స్ : సర్వే

కొంచెం ట్రాఫిక్ కష్టాలు ఉన్నప్పటికీ ఎక్కువమంది ఐటీ ఫ్రొఫెషనల్స్ ఉద్యోగం చేసేందుకు బెంగళూరునే బెస్ట్ సిటీగా పరిగణిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. బెంగళూరులో ఉన్న అత్యున్నత జీవన ప్రమాణాలు(high living standards),అత్యధిక మదింపు(highest appraisal),వృత్తి వృద్ధి అవకాశాలు(career growth opportunities)వంటి వాటికి ఐటీ ఉద్యోగులు ఫిదా అవుతున్నారని,దీంతో దేశవ్యాప్తంగా చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉద్యగం చేయడానికి బెంగళూరునే ఉత్తమ సిటీగా భావిస్తున్నారని ఆ సర్వేలో తేలింది. 

40శాతం మందికి పైగా ఐటీ ప్రొఫెషనల్స్ బెంగళూరునే వర్క్ చేయడానికి బెస్ట్ సీటీ అని ఓటు వేశారని టెక్ గిగ్స్ చేసిన సర్వే తెలిపింది. ఇక 13శాతం ఓటింగ్ తో హైదరాబాద్ ఇందులో రెండవ స్థానంలో నిలిచింది. బెంగుళూరు పోటినిచ్చింది. ఇక 11శాతం ఓటింగ్ తో పూణే మూడవస్థానంలో నిలిచింది. ఇక ఇష్టపడే నగర చార్టులో ఢిల్లీ-NCR (20 శాతం) అతి తక్కువ ఓట్లను సాధించింది. 21 శాతం ఓట్లతో కోల్‌కతా ఢిల్లీ-NCR కంటే కొంచెం మెరుగ్గా ఉందని సర్వే తెలిపింది. ఏప్రిల్ ప్రారంభంలో ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో కనీసం రెండేళ్ల అనుభవవమున్న 25-35ఏళ్ల మధ్య వయస్సు ఉన్న దాదాపు 1900మంది ఐటీ ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు. 

అధిక జీవన ప్రమాణాలను అందిస్తున్న బెంగళూరునే…సర్వేలో 58 శాతం మంది ఐటి నిపుణులు ఇష్టపడ్డారు. జీతం పెంపు విషయంలో 71 శాతం మంది, ఉద్యోగ అవకాశాలకు,వృత్తి వృద్ధి విషయంలో 61శాతంమంది బెంగళూరు ఉత్తమమైన నగరంగా పేర్కొంటూ ఓటు వేశారు. 57 శాతం మంది ఐటి నిపుణులు తమకు నచ్చిన నగరంలో ఇప్పటికే పనిచేస్తున్నారని సర్వే వెల్లడించింది. నగరాన్ని మార్చడం(వేరే నగరానికి వెళ్లాలనుకోవడం) గురించి వారి భవిష్యత్ ఫ్లాన్స్ గురించి అడిగినప్పుడు…. వారిలో ఎక్కువ మంది తమ పని నగరాన్ని మార్చడానికి ఆసక్తి చూపలేదని సర్వే తెలిపింది. హైదరాబాద్‌లో పనిచేస్తున్నవారిలో ఎక్కువమంది ఇక్కడే పనిచేయడానికి ఇష్టపడ్డారు.

అనుభవజ్ఞులైన నిపుణులు మరియు ఫ్రెషర్లలో బెంగళూరు మొదటి స్థానాన్ని గెలుచుకుంది. ఐటి నిపుణులకు  పరిశ్రమలో తమ వృత్తిని ప్రారంభించడానికి బెంగళూరు సిటీ ఉత్తమ అవకాశాలను అందిస్తోందని 61 శాతం మంది ఐటి నిపుణులు చెప్పినట్లు సర్వే తెలిపింది.(ఏపీలోని ఆ 4 జిల్లాలోనే కరోనా కేసులు ఎక్కువ)