Bhagwant Mann : పంజాబ్‌లో సరికొత్త పాలన.. 122 మంది మాజీ ఎమ్మెల్యేల భద్రత తొలగింపు

తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు... పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో పాటు 122 మంది మాజీ ఎమ్మెల్యేలకు భద్రత తొలగించారు.

Security Of 122 Ex-MLAs Including Sidhu : పంజాబ్ రాష్ట్రంలో ఎలాంటి పాలన ఉండబోతోంది ? కొత్తగా వచ్చే ఆప్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనబోతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే.. తమ పాలన ఎలా ఉంటుందనేది ప్రభుత్వం ఏర్పాటు చేయముందే చెబుతోంది ఆ పార్టీ. ఆ పార్టీ అభ్యర్థి కాబోయే సీఎం భగవంత్ మాన్ తనదైన శైలిలో పాలనకు ఇప్పటి నుంచే శ్రీకారం చుట్టారు. 2022, మార్చి 16వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కానీ.. ప్రమాణ స్వీకారం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారాయన. రాజ్ భవన్ లో కాకుండా భగత్ సింగ్ గ్రామమైన ఖట్కర్ కలన్ లో సీఎంగా ప్రమాణం చేస్తానని ప్రకటించి అందరి దృష్టిని మరోసారి ఆకర్షించారు. అంతేగాకుండా కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటోలు ఉండవని, షహీద్ భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటోలు ఉంటాయని వెల్లడించారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read More : Punjab:‘‘మనం ఏం విత్తనం నాటితే ఆ మొక్కే మొలుస్తుంది..ఓడాక కావాల్సింది చింత కాదు చింతన‘‘ కాంగ్రెస్ పై సిద్ధూ చురకలు

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో పాటు 122 మంది మాజీ ఎమ్మెల్యేలకు భద్రత తొలగించారు. రజియా సుల్తానా, పర్గత్ సింగ్, ధరంబీర్ అగ్ని హోత్రి, తర్లోచన్, అరుణ్ నారంగ్, రాణా గుర్జీత్ సింగ్, మన్ ప్రీత్ సింగ్ బాదల్, భరత్ భూషణ్ అషు, నాథూ రామ్, దర్శన్ లాల్ లతో పాటు ఇతరుల భద్రతను వెనక్కి పిలిచారు. అయితే.. భగవంత్ మాన్ వేణు ప్రసాద్ ను ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించినట్లు సమాచారం.

Read More : AAP Punjab : పంజాబ్‌లో కొత్త చరిత్ర సృష్టించిన ఆప్‌.. జాతీయ పార్టీలను ఊడ్చి పారేసిన ‘చీపురు’

మరోవైపు…మొహలీలో ఆప్ ఎమ్మెల్యేల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో భగవంత్ మాన్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఆయన గవర్నర్ ను కోరారు. ఖట్కర్ కలాన్ లో మార్చి 16వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా… పంజాబ్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆఫ్ విజయదుందుభి మ్రోగించింది. 117 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఆప్ ఏకంగా 92 సీట్లలో విజయం సాధించింది. చీపురు దెబ్బకు కాంగ్రెస్, బీజేపీతో సహా ఇతర పార్టీలు కొట్టుకపోయాయి. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్ర సీఎంగా ఉన్న చరణ్ జీత్ సింగ్ చన్నీ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు సమర్పించారు.

ట్రెండింగ్ వార్తలు