Bharat Biotech applies for emergency use authorisation for Covaxin కరోనా వైరస్‌కు మరికొద్ది వారాల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల మొదటగా దేశంలో ఫైజర్/బయోఎన్ టెక్ కోవిడ్ వ్యాక్సిన్అత్యవసర వినియోగానికి ఫైజర్ ఇండియా దరఖాస్తుకున్న విషయం తెలిసిందే. బ్రిటన్, బహ్రెయిన్ దేశాలు అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడంతో భారత్ లోనూ ఆ సంస్థ దరఖాస్తు చేసింది.
అయితే, సోమవారం ఉదయం సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వ్యాక్సిన్ “కోవిషీల్డ్ (ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనకా టీకా)” అత్యవసర వినియోగానికి డీసీజీఐకి దరఖాస్తు చేయగా,దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ “కోవాగ్జిన్” అత్యవసర వినియోగ ఆమోదానికి భారత్ బయోటెక్ కూడా ఇవాళే డీసీజీఐ(Drugs Controller General of India)కి దరఖాస్తు చేసినట్లు సమాచారం.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)సహకారంతో భారత్ బయోటెక్ “కోవాగ్జిన్”డెవలప్ చేస్తున్న విషయం తెలిసిందే. తమ సమర్థవంతమై వ్యాక్సిన్ చాలా సురక్షితమైనదని,ప్రయోజనకరమైనదని భారత్ బయోటెక్ ఇప్పటికే ప్రకటించింది. కోవాగ్జిన్ మూడో దశ ట్రయిల్స్ సమయంలో వాలంటీర్ గా ముందుకొచ్చి మొదటి డోస్ తీసుకున్న తర్వాత హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన తర్వాత భారత్ బయోటెక్ నుంచి ఈ ప్రకటన వచ్చింది.
గత నెల 28న హర్యానా ఆరోగ్య మంత్రికి మొదటి డోస్ టీకా వేశారు. అంతా సవ్యంగా ఉందనుకున్న దశలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. దీంతో కోవాగ్జిన్ టీకాపై చర్చోపచర్చలు ప్రారంభమయ్యాయి. అయితే.. కోవాగ్జిన్ టీకా రెండు డోసుల షెడ్యూల్ ఆధారంగా ఉందని,రెండు డోస్ లు వేసుకున్న తర్వాత పధ్నాలుగు రోజులకు యాంటీ బాడీస్ డెవలప్ అవుతాయని భారత్ బయోటెక్ వివరణ ఇచ్చింది. అనిల్ విజ్ ఒక్క సారి మాత్రమే టీకా డోస్ తీసుకున్నారని రెండో డోస్.. మొదటి డోస్ తీసుకున్న తర్వాత నెల రోజులకు ఇస్తామని కానీ దురదృష్టవశాత్తూ అనిల్ విజ్ ఈ లోపే కరోనా బారిన పడ్డారని భారత్ బ
మరోవైపు, భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు ఫైజర్ యొక్క దరఖాస్తులను రాబోయే రోజుల్లో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) లో COVID-19 సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (SEC) సమీక్షిస్తుంది. అయితే, ఇప్పటివరకు ఏ దరఖాస్తులూ కమిటీకి పంపబడలేదు మరియు దరఖాస్తులను అంచనా వేయడానికి మరియు మూల్యాంకనం చేయడానికి SEC ఎప్పుడు మీట్ అవుతుంది అనే డేట్ ని నిర్ణయించలేదు అని ఒక అధికారి తెలిపారు.