Bharat Biotech : కోవాగ్జిన్ ధరపై భారత్ బయోటెక్ కీలక ప్రకటన

దేశంలో ప్రైవేట్ సెక్టార్ లో అందుబాటులో ఉన్న ఇతర కోవిడ్-19 వ్యాక్సిన్ లతో పోల్చితే కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఎక్కువ ధర ఉండటాన్ని భారత్ బయోటెక్ సమర్థించుకుంది.

Bharat Biotech దేశంలో ప్రైవేట్ సెక్టార్ లో అందుబాటులో ఉన్న ఇతర కోవిడ్-19 వ్యాక్సిన్ లతో పోల్చితే కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఎక్కువ ధర ఉండటాన్ని భారత్ బయోటెక్ సమర్థించుకుంది. ఈ మేరకు సంస్థ మంగళవారం ఒక విఢుదల చేసింది.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి కొవాగ్జిన్‌ టీకా ఒక్కో డోసును కేవలం రూ.150కి ఇస్తున్నట్లు భారత్ బయోటెక్ తన ప్రకటనలో పేర్కొంది. తమకు నష్టాలొస్తున్నప్పటికీ, ఇప్పటికే తక్కువ ధరకే ప్రభుత్వానికి వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని తెలిపింది. అయితే,ఎక్కువ కాలం ఇంత తక్కువ ధరకు వ్యాక్సిన్ ను సరఫరా చేయడం సాధ్యం కాదని భారత్ బయోటెక్ సృష్టం చేసింది. ప్రభుత్వానికి అమ్ముతున్న తక్కువ ధర వల్ల కొంత తమకు వస్తున్న నష్టాన్ని భర్తీ చేసేందుకే ప్రైవేటు రంగానికి సరఫరా చేసే టీకాలు తాము ఎక్కువ ధరకు అమ్ముతున్నామని వెల్లడించింది. దాన్ని బట్టే ప్రైవేటు ఆస్పత్రులు కూడా టీకా ధర వసూలు చేస్తున్నారని చెప్పింది.

ప్రైవేట్ రంగానికి సరఫరా చేసే వ్యాక్సిన్ల ధరను తగ్గించలేమని తేల్చి చెప్పిన భారత్ బయోటెక్.. అయితే తమ ఉత్పత్తిలో 10శాతం కంటే తక్కువవే ప్రైవేట్‌ రంగానికి కేటాయిస్తున్నట్లు తెలిపింది. మిగిలిన వాటిని రాష్ట్రానికి, కేంద్రానికి సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. ప్రొడక్ట్ డెవలప్ మెంట్,క్లినికల్ ట్రయిల్స్ మరియు కోవాగ్జిన్ ఉత్పత్తి సౌకర్యాల కోసం భారత్ బయోటెక్ తన సొంత వనరుల నుంచి ఇప్పటివరకు రూ.500 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు