Fire In Vande Bharat Train : వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు, భయాందోళనలో ప్రయాణీకులు

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజన్ లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురి అయ్యారు.

Vande Bharat Express Catches Fire

Vande Bharat Train : వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు (Vande Bharat Express) లో మంటలు చెలరేగాయి. లోకో పైలట్ అప్రమత్తమవ్వటంతో పెను ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్ (madhya pradesh )లోని భోపాల్(Bhopal)-ఢిల్లీ వందేభారత్ రైలులో ఈ ప్రమాదం సంభవించింది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వందేభారత్ రైళ్ల ప్రమాదం కలవర పెడుతున్న క్రమంలో రైలులో మంటలు చెలరేగటం ఆందోళన కలిగిస్తోంది.

మధ్యప్రదేశ్‌లో సోమవారం (జులై 17,2023) తెల్లవారుజామున 5.40 గంటలకు భోపాల్ నుంచి బయలుదేరి హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఇంజిన్‌కు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన లోకోపైలట్ కుర్వాయి కేథోరా స్టేషన్‌లో రైలును నిలిపివేయటంతో పెను ప్రమాదం తప్పింది. రైలులోకి ఓ కోచ్ లో బ్యాటరీ బాక్స్ లో బంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది.

ఈ ప్రమాదం జరిగిన వివరాల ప్రకారం..సోమవారం ఉదయం వందే భారత్ రైలు భోపాల్ నుంచి ఢిల్లీ బయలుదేరింది. ఈ క్రమంలో రాణికమలాపాటి స్టేషన్ నుంచి ప్రమాదం మొదలైన తరువాత కుర్వాయి స్టేషన్ వద్ద రైలులోని బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో రైల్వే సిబ్బంది మంటలను గుర్తించి లోకో పైలట్ ను అప్రమత్తం చేయటంతో రైలును కేథోరా స్టేషన్‌లో నిలిపివేయటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంతో భయాందోళనలకు గురి అయిన ప్రయాణీకులు రైలు దిగిపోయారు.