Bengaluru Metro Fares Hiked : మెట్రో రైలు ప్రయాణికులకు బిగ్ షాక్.. ఛార్జీలు 50శాతం పెంపు..
ధరల పెంపుతో పాటు ఉబర్, ఓలా తరహాలో పీక్, నాన్ పీక్ అవర్స్ విధానాన్ని తీసుకొచ్చారు.

Bengaluru Metro Fares Hiked : బెంగళూరు వాసులకు మెట్రో ప్రయాణం ఖరీదుగా మారింది. మెట్రో రైలు ఛార్జీలు 50శాతం పెంచారు. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల మేరకు బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ టికెట్ ధరలను సవరించింది. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి.
ఇటీవలే బస్సు ఛార్జీలు పెంపు, ఇప్పుడు మరో వాత..
ధరల పెంపుతో పాటు ఉబర్, ఓలా తరహాలో పీక్, నాన్ పీక్ అవర్స్ విధానాన్ని తీసుకొచ్చారు. బెంగళూరు మెట్రో ప్రస్తుత గరిష్ట ధర 60 రూపాయలు ఉండగా.. అది 90 రూపాయలకు పెరగనుంది. సవరించిన ధరలను ఫేర్ ఫిక్సేషన్ కమిటీ డిసెంబర్ 16న సమర్పించింది. బీఎంఆర్ సీఎల్ బోర్డు ఆమోదం మేరకు ఇవాళ్టి నుంచి పెంచిన టికెట్ ధరలు అమలు కానున్నాయని తెలిపింది.
Also Read : ఏఏఐలో ఉద్యోగాలు పడ్డాయి.. అర్హతలు, ఎంపిక ప్రక్రియ ఇదే.. జాబ్ కొడితే నెలకు లక్షపైనే జీతం!
ఇప్పటికే కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం 15శాతం మేర బస్సు ఛార్జీలను వడ్డించింది. తాజాగా మెట్రో ఛార్జీలు కూడా పెరగడంతో బెంగళూరు వాసుల ప్రయాణం మరింత భారం కానుంది.
కొత్తగా పీక్ అవర్ టారిఫ్ సిస్టమ్..
ఇక మెట్రో ప్రయాణంలో కొత్తగా పీక్ అవర్ టారిఫ్ సిస్టమ్ ను తీసుకొచ్చారు. ఉదయం రైళ్లు ప్రారంభమైనప్పటి నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మళ్లీ రాత్రి 9 గంటల నుంచి చివరి వరకు హాఫ్ పీక్ అవర్స్ గా నిర్ణయించారు. అంటే, మిగిలిన సమయాన్ని పీక్ అవర్స్ గా పరిగణిస్తారు.
స్మార్ట్ కార్డులపైన పీక్ అవర్స్ సమయంలో 10శాతం, హాఫ్ పీక్ అవర్స్ సమయంలో 5శాతం డిస్కౌంట్ ఇస్తారు. నిజానికి ఈ మెట్రో ఛార్జీల పెంపు నిర్ణయం ఈ నెల మొదటి నుంచే అమలు కావాల్సి ఉన్నా.. వారం పాటో హోల్డ్ లో పెట్టారు. ఛార్జీల సవరణకు ముందు సమగ్ర రిపోర్ట్ సమర్పించాలని మోదీ ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నారు. వారం తర్వాత పెంపు నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చారు.
Also Read : వేసవిలో ఏసీ వాడినా బిల్లు తక్కువగా రావాలన్నా పవర్ ఆదా కావాలన్నా ఈ సూపర్ టిప్స్ ట్రై చేయండి!
* గరిష్ట ధర ప్రస్తుతం 60 రూపాయలు కాగా 90 రూపాయలకు పెంపు
* మినిమమ్ బ్యాలెన్స్ 50 రూపాయల నుంచి 90 రూపాయలకు పెంపు
* 0-2 కిలోమీటర్ల దూరానికి 10 రూపాయలు
* 2-4 కిలోమీటర్ల దూరానికి 20 రూపాయలు
* 4-6 కిలోమీటర్ల దూరానికి 30 రూపాయలు
* 6-8 కిలోమీటర్ల దూరానికి 40 రూపాయలు
* 8-10 కిలోమీటర్ల దూరానికి 50 రూపాయలు
* 10-12 కిలోమీటర్ల దూరానికి 60 రూపాయలు
* 15-20 కిలోమీటర్ల దూరానికి 70 రూపాయలు
* 20-25 కిలోమీటర్ల దూరానికి 80 రూపాయలు
* 25-30 కిలోమీటర్లు అంతకు మించిన దూరానికి 90 రూపాయలు