Bihar Assembly Election Results: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Results) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాల్లో ఎన్డీఏ ముందంజలో ఉంది. ఎన్డీఏ 201, మహాఘట్‌బంధన్ 36, ఇతరులు 6 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
బిహార్‌లో 243 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకైనా/కూటమికైనా కనీసం 122 స్థానాల మెజార్టీ అవసరం.
ఎన్డీఏ భారీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో ఆ కూటమి నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. తన పార్టీని గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. 243 స్థానాల్లోనూ పోటీ చేసిన ఆయన పార్టీ ఒక్క సీటూ గెలవలేదు.
బిహార్ ఎన్నికలు- 2025 ఇలా జరిగాయ్..
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. ఎన్‌డీఏ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా జనతా దళ్ (యునైటెడ్), భారతీయ జనతా పార్టీ 101 స్థానాల చొప్పున పోటీ చేయగా, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 స్థానాల్లో, హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా తలా 6 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
మహాఘట్‌బంధన్‌లో రాష్ట్రీయ జనతా దళ్ 143 స్థానాల్లో, కాంగ్రెస్ 61 స్థానాల్లో, సీపీఐ 9, సీపీఎం 4, సీపీఐ(ఎం-ఎల్)ఎల్ 20, వికాస్‌శీల ఇన్సాన్ పార్టీ 15 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఈసారి ఎన్నికల్లో అత్యధికంగా దాదాపు 67.13 శాతం పోలింగ్ నమోదైంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీలు
రాష్ట్రీయ జనతా దళ్
జనతా దళ్ (యునైటెడ్)
భారతీయ జనతా పార్టీ
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు) లిబరేషన్