Brother Killed sisters boyfriend chopped body into pieces
Honor killing : తన చెల్లెలి ప్రియుడ్ని అత్యంత కిరాతకంగా చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కలకు ఆహారంగా వేసిన ఘటనతో బీహార్‌లో మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. చెల్లెలు ఓ వ్యక్తిని ప్రేమించిందని తెలిసి అన్న ఉగ్రుడైపోయాడు. అంతే పక్కా ప్లాన్ వేశాడు. కొంతమందితో కలిసి చెల్లెలి ప్రియుడి నరికి చంపాడు. అక్కడికి అతని కసి తీరలేదు.కోపం చల్లారలేదు. ఆ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. కొన్ని ముక్కల్ని అక్కడే ఉన్న కుక్కలకు ఆహారంగా వేశాడు. మిగిలిన ముక్కలను నదిలోపారేశాడు. ఆగ్రహంతో విచక్షణ కోల్పోయి మనిషి అనే సంగతే మర్చిపోయిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తాను చేసిన దారుణాన్ని వెల్లడించారు.
బీహార్ లోని నలందా జిల్లాలో జరిగిన ఈ అత్యంత పాశవిక ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన సోదరి ప్రేమించిన యువకుడిని ముక్కలుగా నరికి చంపిన వ్యక్తి శరీర భాగాలను కుక్కలకు ఆహారంగా వేశాడు రాహుల్ కుమార్ అనే 19 ఏళ్ల యువకుడు. డిసెంబర్ (2022) 16న ఇంటి నుంచి బయటకు వెళ్లిన బిట్టు కుమార్ అనే 20 ఏళ్ల (రాహుల్ సోదరిని ప్రేమించిన వ్యక్తి) యువకుడు రాత్రి అయినా ఇంటికి తిరిగిరాకపోవటంతో ఆందోళన పడిన కుటుంబ సభ్యులు అతని స్నేహితులను..బంధువుల వద్ద విచారించారు. కానీ ఎక్కడా అతని జాడ తెలియలేదు.
దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు డిసెంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా..బిట్టు ఫోన్ కాల్ డేటా ఆధారంగా రాహుల్ కుమార్ వద్ద ఉన్న బిట్టు ఫోన్ ఉండటంతో అనుమానంతో వెంటనే రాహుల్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నేను బిట్టును చంపానని అంగీకరించాడు.
బిట్టు తన సోదరితో సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయానని, అందుకనే అతడిని తన సోదరి ఫోన్ తో బిట్టకు ఫోన్ చేసిన రప్పించి 16న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చంపేశానని అంగీకరించాడు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశానని..మిగతా వాటిని నదిలో పడేశానని చెప్పాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.