covid in Bihar : బీహార్ లో కొత్త వేరియంట్ కలకలం..10రెట్లు ప్రమాదకరం అంటున్న నిపుణులు

బీహార్ లో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఇది 10రెట్లు ప్రమాదకరం అని చెబుతున్నారు నిపుణులు.

New Omicron sub-variant BA.12 detected in Patna : రెండేళ్ల నుంచి కోవిడ్ యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తోనే ఉంది. నియంత్రణ కోసం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతునే ఉంది. కానీ కోవిడ్ మాత్రం కొత్త కొత్త వేరియంట్లుగా మారి భయపెడుతునే ఉంది. ఎక్కడోక చోట తన ఉనికి చాటుకుంటే కొత్త కొత్త వేరియంట్లుగా బయటపడుతునే ఉంది. ఈ క్రమంలో బీహార్ లో మరో కొత్త వేరిచంట్ వెలుగులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గి కాస్త రిలాక్స్ అవుతున్న వేళ మరోసారి కోవిడ్ నాలుగో వేవ్ భయాలు నెలకొన్నాయి. ఈ సమయంలో బీహార్ లో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఢిల్లీలో ఐదు బీఏ.2.12 కేసులు నమోదయ్యాయి మరియు ఇప్పుడు పాట్నాలో ఒక కేసు కనుగొనబడింది.

Also read : Covid cases: భారత్‌లో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు.. 17వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

ఒమిక్రాన్ లోని ఉపరకం బీఏ.12 తొలి కేసు నమోదైంది. ఒమిక్రాన్ (BA.12) కన్నా ఇది పది రెట్లు ప్రమాదకరమైందని నిపుణులు వెల్లడించారు. దీని ప్రమాదం వలెనే అంతే వేగంగా జనాలకు సోకుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకిన ఓ వ్యక్తి శాంపిల్ కు పాట్నాలోని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (IGIMS)లో జన్యు క్రమ విశ్లేషణ చేయగా బీఏ.12 పాజిటివ్ గా వెల్లడైందని అధికారులు చెప్పారు. 13 శాంపిళ్లు ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలగా.. అందులో 12 శాంపిళ్లు బీఏ.2 అని, ఇంకొకటి వేగంగా వ్యాపించే గుణం ఉన్న బీఏ.12 అని గుర్తించారు.

ఈ ఉపరకం కరోనా చాలా ప్రమాదకరమైందని ఐజీఐఎంఎస్ మైక్రోబయాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ నమ్రత హెచ్చరించారు. ఇతర ఒమిక్రాన్ ఉప రకాలతో పోలిస్తే దీని సంక్రమణ శక్తి చాలా చాలా రెట్లు ఎక్కువని ఆమె తెలిపారు. వాస్తవానికి ఈ ఉపరకం తొలి కేసును తొలుత అమెరికాలో గుర్తించారు. గత వారం ఢిల్లీలో మూడు కేసులు బయటపడ్డాయి. తాజాగా బీహార్ లోనూ వెలుగు చూసింది. దీంతో ఆందోళన నెలకొంది.

Also read : Time travel : హిందూ పురాణాల్లో టైమ్‌ ట్రావెల్‌ గురించి విశేషాలు..!!

మరోవైపు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 3,377 మంది కరోనా బారిన పడ్డారు. అంతకుముందు రోజు 3,303 కేసులు నమోదవగా.. ఇవాళ 74 కేసులు ఎక్కువగా వచ్చాయి. పెరుగుతున్న కేసులతో పాటే యాక్టివ్ కేసులూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం 17,801 మంది ఇంకా మహమ్మారి కారణంగా బాధపడుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు