Time travel : హిందూ పురాణాల్లో టైమ్‌ ట్రావెల్‌ గురించి విశేషాలు..!!

టైమ్‌ మెషీన్‌ లేకుండానే గతంలోకి వెళ్లొచ్చా?విశ్వంలోకి వెళ్లేందుకు షార్ట్‌ కట్‌ ఉందా? రష్యా ప్రాజెక్ట్‌తో కల నెరవేరుతుందా? అనే ఎన్నో ప్రశ్నలకు హిందూ పురాణాల్లో ఉన్న కథలే ఉదాహరణ అంటున్నారు నిపుణులు.

Time travel : హిందూ పురాణాల్లో టైమ్‌ ట్రావెల్‌ గురించి విశేషాలు..!!

Time Travel In Hindu Mythology (2)

Time travel in Hindu mythology : టైమ్‌ మెషీన్‌ లేకుండానే గతంలోకి వెళ్లొచ్చా?విశ్వంలోకి వెళ్లేందుకు షార్ట్‌ కట్‌ ఉందా? రష్యా ప్రాజెక్ట్‌తో కల నెరవేరుతుందా? అనే ఎన్నో ప్రశ్నలు..మరెన్నో సందేహాలు..లేనిది ఎప్పటికీ ఉండదు.. ఉన్నది ఎక్కడికీ పోదు.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే. కాస్త అటూఇటూగా సైన్స్‌ కూడా ఇదే చెప్తోంది. ఒక పదార్థాన్ని మనం సృష్టించలేం.. దాన్ని నాశనం చేయలేం అంటుంది. అప్పటిదాకా మనముందున్న పదార్థం మనముందు లేకపోయినా.. అది వేరే రూపంలోకి మారిపోతుందన్న మాట. ఈ విషయాన్ని వేల సంవత్సరాల క్రితమే మన మహర్షులు చెప్పారు. మన పురాణాల్లోనూ టైమ్‌ ట్రావెల్‌ ప్రస్తావన ఉంది. ఓసారి త్రేతాయుగంలో దేవలోకం మీదికి రాక్షసులు దండెత్తుతారు. ఇతర లోకాల వీరుల సహాయాన్ని దేవేంద్రుడు కోరడంతో.. భూలోకంలోని ముచికుందుడనే రాజు దేవలోకం వెళ్లి రాక్షసులతో పోరాడతాడు. ఏడాదిపాటు జరిగిన యుద్ధంలో రాక్షసులు ఓడిపోతారు.

Also read :  Shocking news : 2021 డిసెంబర్‌ 25న మహాద్భుతం జరుగుతుందట..!మనుషుల జీవితాలే మారిపోతాయట..!!

యుద్ధం ముగిశాక ముచికుందుడు తాను తిరిగి భూలోకానికి వెళ్లి తన కుటుంబాన్ని కలవాలనుకుంటున్నానంటాడు. దానికి ఇంద్రుడు నువ్వు ఇక్కడ యుద్ధం చేసింది ఏడాదిపాటు. భూలోకంలో కొన్ని లక్షల సంవత్సరాలు గడిచి పోయాయి. కాబట్టి ఇప్పుడు నీవాళ్లెవరూ అక్కడ లేరంటాడు. వివిధ లోకాల్లో కాలం ఎలా వేరుగా ఉంటుందో తెలియడానికే ఈ కథ. యోగసాధనతో కాలంలోకి వెళ్లడం సాధ్యమేనని యోగ వాసిష్టం లాంటి గ్రంథాన్ని చూస్తే తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఐన్ స్టీన్ చెప్పిన టైం డైలేషన్ అనేది పురాణాల్లో కూడా ఉందని అర్థమవుతోంది.

Also read : Time travel : హిందూ పురాణాల్లో టైమ్‌ ట్రావెల్‌ గురించి విశేషాలు..!!

టైమ్‌ ట్రావెల్‌ చేయాలంటూ టైమ్ మెషీన్‌ నిర్మించాలి. దానికి శక్తి కావాలి. మనం కారులో వాడటానికి శక్తి కోసం పెట్రోల్‌, డీజిల్ లాంటివి వాడుతుంటాం. కానీ టైమ్‌ మెషీన్‌కు ఈ శక్తి చాలదు. నక్షత్రాల శక్తిని నియంత్రించగలిగే సామర్థ్యం కావాలి. అలాకాని పక్షంలో ఓ అసాధారణ పదార్థాన్ని కనుక్కోవాలి. దీన్నే నెగిటివ్ ఎనర్జీ అంటున్నారు. రెండు సమాంతర ప్లేట్ల సాయంతో అతికొద్ది పరిమాణంలో ఈ నెగెటివ్ ఎనర్జీని శాస్త్రవేత్తలు సృష్టించగలిగారు. అయితే ఒక టైమ్ మెషీన్ పని చేయాలంటే భారీ పరిమాణంలో ఈ నెగెటివ్ ఎనర్జీ కావాలి. దీన్ని సృష్టించడమే ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద సవాల్‌.

మరోవైపు టైమ్‌ మెషిన్‌తో పనిలేకుండానే టైమ్‌ ట్రావెల్‌ చేయొచ్చని నమ్మేవారు ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. ఆయన టైమ్ ట్రావెల్‌పై లోతైన పరిశోధన చేశారు. ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న చోట.. కాలం నెమ్మదిస్తుందని అంచనా వేశారు. ఆ సిద్ధాంతం ప్రకారం.. బ్లాక్ హోల్ దగ్గర్లో కాలం వేగం సగానికి తగ్గిపోతుంది. అంటే.. అక్కడికి వెళ్లి ఓ 20 ఏళ్లు గడిపితే.. భూమిపై అది 40 ఏళ్లతో సమానం. అయితే.. బ్లాక్‌హోల్ దగ్గరకు కాంతివేగంతో వెళ్లినా వేల సంవత్సరాలు పడుతుంది. అన్నేళ్లపాటూ స్పేస్‌షిప్‌లో ఉన్న వాళ్లు బతకడం సాధ్యం కాదు. అసలీ కాంతితో సంబంధం లేకుండా మనం ఈ విశ్వంలోంచి.. మరో విశ్వంలోకి వెళ్లడానికి వార్మ్ హోల్స్ మార్గం చూపిస్తాయని హాకింగ్‌తోపాటూ చాలామంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. వార్మ్‌హోల్స్ అనేవి అంతరిక్షంలో షార్ట్ కట్స్ లాంటివి. ఒక విశ్వంలోని ఏ ప్రాంతం నుంచైనా మరో విశ్వంలోని మరో ప్రాంతంలోకి క్షణాల్లో వెళ్లిపోయేందుకు వీలు కల్పిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే వార్మ్‌హోల్స్ టైమ్ మెషీన్లుగా పనిచేస్తాయి. ఇవి విశ్వమంతా వ్యాపించి ఉన్నాయని ఐన్‌స్టీన్ నమ్మాడు. ఇవి ఉన్నాయా లేదా అన్నదే ఓ సమస్య అయితే.. వీటిలో ప్రాణం తీసేంత ఎక్కువ రేడియేషన్ ఉంటుందన్నది మరో సమస్య. అందుకే వార్మ్‌హోల్‌లో ప్రయాణం ప్రస్తుతానికి ఊహ మాత్రమే.

Also read : Time Traveller..?! : 2027 నుంచి వచ్చాడట..!ఈ భూమ్మీద మిగిలి ఉన్న ఏకైక మనిషిని ఇతనేనట..!!

మరోవైపు విశ్వ రహస్యాల్ని ఛేదించేందుకు.. రష్యా ఓ ప్రాజెక్టు చేపట్టింది. అదే టెలీపోర్టేషన్. మనుషుల్ని కాంతి రూపంలోకి మార్చుతారు. మనిషిలోని అణువులన్నింటినీ వేరు చేసి.. వాటిని విశ్వంలోని మరో ప్రాంతానికి చేరుస్తారు. అక్కడ తిరిగి ఆ అణువులన్నీ కలిసి మానవ రూపం ఏర్పడుతుంది. నిజానికి ఇదో ప్రమాదకర ప్రాజెక్టు. టెలీపోర్టేషన్‌లో సమాచారాన్ని చేరవేస్తే తప్పులేదు గానీ.. మనుషుల్ని తీసుకెళ్లాలనుకోవడం తప్పంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఈ ప్రాసెస్‌లో ఏ చిన్న తేడా వచ్చినా.. ప్రాణం పోయినట్లే. అణువులన్నీ తిరిగి మనిషిలా మారినా.. ప్రాణం తిరిగొస్తుందన్న గ్యారెంటీ లేదు. కానీ, టైమ్‌ మెషీన్ మన దగ్గరుంటే కరోనా వైరస్ అంతుచూసే వాళ్లమేమో. లేదా భవిష్యత్తులోకి ప్రయాణించి వ్యాక్సిన్ గురించి చెప్పేవాళ్లమేమో. మొత్తానికి టైమ్ ట్రావెల్‌పై చాలా సిద్ధాంతాలున్నా.. ఒక్కటీ నిజమయ్యేలా లేవు. కాంతి వేగాన్ని అందుకోవడమే అసలు సమస్య. సో.. టైమ్ ట్రావెల్ అనేది ఓ పాజిటివ్ ఐడియా మాత్రమే. అది సాధ్యమా, కాదా అన్నది ఇప్పుడే చెప్పలేం. పరిశోధనలు, ప్రయోగాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.