Time Travel : టైమ్‌ ట్రావెల్‌ సాధ్యమేనంటున్న శాస్త్రవేత్తలు..! గతాన్నే కాదు భవిష్యత్తును కూడా చూడొచ్చట..!!

టైమ్‌ ట్రావెల్‌ సాధ్యమేనంటున్నారు శాస్త్రవేత్తలు..!! అయితే గతాన్నేకాదు భవిష్యత్తును కూడా చూసేద్దామా?!

Time Travel : టైమ్‌ ట్రావెల్‌ సాధ్యమేనంటున్న శాస్త్రవేత్తలు..! గతాన్నే కాదు భవిష్యత్తును కూడా చూడొచ్చట..!!

Time Travel

Time Travel : శ్రీకృష్ణ దేవరాయల పాలనను తిలకిద్దామా!..మహాత్మా గాంధీని కళ్లారా చూద్దామా!..దేశ విభజన ఎలా జరిగిందో తెలుసుకుందామా?..భవిష్యత్‌లోకి వెళ్లి మన జాతకాన్ని చూసుకుందామా?..ఈ సీన్లన్నీ మేం కూడా చూశామంటారా? ఆదిత్య 369ను ఎప్పుడో చూసేశామంటారా? అది.. రీల్‌.. కానీ, మేం చెప్పబోయేది రియల్‌. అక్షరాలా నిజం. టైమ్‌ ట్రావెల్‌తో గతాన్ని కళ్లారా చూడొచ్చంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఫ్యూచర్‌ని కూడా.. ముందుగానే తెల్సుకోవచ్చంటున్నారు.

మనకు వచ్చే కలలు మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. వేరే లోకంలోకి వెళ్తే ఎలా ఉంటుందో.. అని అందరికీ ఇంట్రెస్ట్‌ ఉంటుంది. అందుకే మనిషి అంతరిక్షం దాకా వెళ్లాడు. ఈసారి అంతకుమించి అంటున్నాడు. అదే టైమ్‌ ట్రావెల్‌. కొన్ని సినిమాల్లో చూపించినట్లుగా టైమ్ మెషిన్ ద్వారా టైమ్ ట్రావెల్ చేయవచ్చనే వాదన కూడా ఉంది. మన ఊహకు కూడా అందని ఎన్నో విషయాల్ని నిజం చేయబోతోంది టైమ్‌ ట్రావెల్‌. గతం.. వర్తమానం.. భవిష్యత్‌ మధ్య తిప్పుతూ ఊహకందని అనుభూతిని అందించబోతోంది.

Also read : Time Traveller..?! : 2027 నుంచి వచ్చాడట..!ఈ భూమ్మీద మిగిలి ఉన్న ఏకైక మనిషిని ఇతనేనట..!!

ఆదిత్య 369 సినిమాలో టైమ్‌ మెషీన్‌లో ఎక్కి హీరో, హీరోయిన్లు రాయలవారి కాలంతో పాటు భవిష్యత్తులోకి వెళ్లి వస్తారు. మూవీ కాబట్టి ఎన్నైనా ఊహించుకోవచ్చు. నిజ జీవితంలో ఇలాంటివి ఆచరణ సాధ్యం కాదని అనుకోవచ్చు. టైమ్‌ ట్రావెల్‌ సాధ్యాసాధ్యాలపై ఐన్‌స్టీన్‌ నుంచి స్టీఫెన్‌ హాకింగ్‌ వరకు ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించారు. తాజాగా..టైమ్‌ ట్రావెల్‌ సాధ్యమేనని కెనడాలోని బ్రాక్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అయితే ప్యారలల్‌ టైమ్‌లైన్స్‌ మాత్రమే దీన్ని ఆచరణలోకి తీసుకురావచ్చంటున్నారు.

అందరూ అనుకుంటున్నట్లు టైమ్‌ ట్రావెల్‌ అనేది బ్రహ్మ పదార్థం ఏం కాదట. దీన్ని సింపుల్‌గా అర్థం చేసుకోవచ్చు. విశ్వంలో ఎక్కడైనా రెండు నక్షత్రాలు ఢీకొని పేలితే.. ఆ పేలుడు కాంతి మన కళ్లకు చేరుకోవడానికి కొన్నేళ్లు పడుతుంది. అంటే..ఇప్పుడు మనం అంతరిక్షంలో ఏదైనా పేలుడు కాంతిని చూస్తే.. అది చాలా సంవత్సరాల కింద పేలినట్లు లెక్క.అంటే గతించిన కాలంలో జరిగిన సంఘటనను ఇప్పుడు మనం వర్తమానంలో కళ్లారా చూస్తున్నామన్నమాట. ఒకవేళ మనం ఆ పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకొంటే.. భూమిపై వర్తమానం జరుగుతుండగానే.. విశ్వంలో పేలుడును ప్రత్యక్షంగా చూడగలం. ఇదే టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌. అయితే మాట్లాడుకున్నంత ఈజీగా టైమ్‌ ట్రావెల్‌ సాధ్యం కాదు.

ఈ సృష్టిలో కాంతిని మించిన వేగం లేదు. ద్రవ్యరాశి ఉన్న ఏ వస్తువు కూడా కాంతికన్నా స్పీడ్‌గా ప్రయాణించలేదు. కానీ, కాంతితో సమానంగా మనం కూడా ట్రావెల్‌ చేస్తే.. భూత, భవిష్యత్‌ కాలాల్ని చేరుకోవచ్చన్నది సైంటిస్టులు వాదన. ఆ వేగాన్ని ఎలా అందుకోవచ్చా అని ఏళ్ల తరబడిగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కాంతి వేగాన్ని అందుకోవాలంటే సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్‌తో ట్రావెల్‌ చేయాలి.

ఇంత స్పీడ్‌తో మనిషి ప్రయాణిస్తే చావు ఖాయం. దీనికితోడు విశ్వంలో అత్యంత ప్రమాదకరమైన గామా కిరణాలుంటాయి. వాటిని హ్యూమన్‌ బాడీ తట్టుకోవడం అసాధ్యం. ఇలాంటి అవరోధాలన్నీ తట్టుకుని కాంతి వేగంగా ప్రయాణించాలంటే.. ఇప్పటిదాకా మన దగ్గరున్న టెక్నాలజీ సరిపోదు. స్పెషల్‌గా స్పేస్‌ షిప్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే అదే టైమ్‌ మెషీన్‌. ఈ మెషీన్‌ తయారు చేయడం కోసమే శాస్త్రవేత్తలు తాపత్రయపడుతున్నారు.

Also read :  Shocking news : 2021 డిసెంబర్‌ 25న మహాద్భుతం జరుగుతుందట..!మనుషుల జీవితాలే మారిపోతాయట..!!

వేల ఏళ్ల క్రితం భూమిపై జరిగిన ఘటనలు ఇప్పటికీ అంతరిక్షంలో కాంతి రూపంలో వెళ్తూనే ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. వాటిని మనం కళ్లారా చూడాలంటే.. కాంతికంటే వేగంగా ప్రయాణించాలి. శూన్యంలో ఆ సంఘటనలు ఎంత దూరం ప్రయాణించాయో.. అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే అప్పుడా కాలంలోకి చేరుకోవచ్చు. నిన్నటి సూర్యోదయాన్ని చూడాలంటే.. 24 గంటలు వెనక్కి వెళ్లాలి. అంటే ఈ సమయంలో కాంతి ప్రయాణించిన 2 వేల 592 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవాలి.

అది కూడా ఒక్క సెకన్‌ కంటే తక్కువ టైంలోనే. అది జరిగితే నిన్నటి సూర్యోదయాన్ని చూడగలమంటున్నారు సైంటిస్టులు. అయితే గతంలోకి వెళ్తే.. అక్కడి దృశ్యాల్ని మనం కళ్లతో చూడగలం.. అంతేకానీ, వాటిలో ఎలాంటి మార్పు చేయలేమని స్పష్టం చేస్తున్నారు. అయితే టైమ్‌ ట్రావెల్‌ చేయాలంటే కాంతి కంటే వేగంగా ప్రయాణించడం ఒక్కటే మార్గమా? అంతకంటే ఈజీ రూట్స్‌ లేవా? అసలీ కాంతితో సంబంధం లేకుండా మనం ఈ విశ్వంలోంచి.. మరో విశ్వంలోకి వెళ్లగలమా.. వెళ్లలేమా..? ఎంతో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో ఏదైనా సాధ్యం అంటున్నారు శాస్త్రవేత్తలు.