Time Traveller..?! : 2027 నుంచి వచ్చాడట..!ఈ భూమ్మీద మిగిలి ఉన్న ఏకైక మనిషిని ఇతనేనట..!!

నేను 2027 నుంచి వచ్చాను..ఈ భూమ్మీద మిగిలి ఉన్న ఏకైక మనిషిని నేనేనంటున్నాడు ఈ వ్యక్తి..!! దానికి సంబంధించి ఓ వీడియోను కూడా చూపిస్తున్నాడు.

Time Traveller..?! : 2027 నుంచి వచ్చాడట..!ఈ భూమ్మీద మిగిలి ఉన్న ఏకైక మనిషిని ఇతనేనట..!!

Tiktok Time Traveler 2027

Tiktok Time Traveler 2027: ‘టైమ్ ట్రావెలర్’. ఈ పాయింట్ మీద చాలా సినిమాలే వచ్చాయి. హాలివుడ్ కూడా ఈ పాయింట్ పై సినిమాలు చాలానే ఉన్నాయి. తెలుగులో ఆదిత్య 369,Play Back వంటివి తెలుగు సినిమాలు కూడా వచ్చాయి. టైమ్‌ ట్రావెలింగ్‌ గురించి ఎన్నో కథలు. మరెన్నో కథనాలు వెలువడ్డాయి. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ఓ వ్యక్తి తాను 2027వ సంత్సరం నుంచి వచ్చాననీ..ఈ భూమ్మీద నివసించిన చివరి వ్యక్తిని నేనేనని చెబుతున్నాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఓ టిక్‌టాక్‌ యూజర్‌ తాను టైం ట్రావెలర్‌ని అని.. 2027 నుంచి ప్రస్తుత కాలానికి వచ్చానని.. భూమ్మీద తాను మాత్రమే మిగిలి ఉన్నానంటున్నాడు. ఇది నిజమా? కాదా? అనేది పక్కన పెడితే ఈ వీడియో మాత్రం తెగ హల్ చల్ చేస్తోంది. దీంతో నెటిజనులు సదరు టిక్ టాక్ యూజర్ని ప్రశ్నలతో ఊదరగొట్టేస్తున్నారు. కామెంట్స్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

టిక్‌టాక్‌ యూజర్‌ యూనికోసోబ్రెవివియంట్ సోమవారం 21 సెకన్ల నిడివి గల వీడియోని తన టిక్‌టాక్‌ అకౌంట్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలో ఎత్తైన పెద్ద పెద్ద బిల్డింగ్‌లు, పార్క్‌ చేసి ఉన్న కార్లు తప్ప మనుషులు ఎక్కడా కనిపించట్లేదు. మరి ఆయూజర్ అయినా కనిపిస్తాడా? అంటూ అతను కూడా కనిపించట్లేదు. కేవలం మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. కానీ ఈ వీడియా స్టాటింగ్ లో ఓ పక్షి మాత్రం ఎగురుతు వెళుతున్నట్లుగా కనిపిస్తుంది.ఈ వీడియోలో సదరు యూజర్ మాటల్లో ‘‘నా పేరు జేవియర్.. నేను 2027 నుంచి ప్రస్తుత కాలానికి (అంటూ గతంలోకి) వచ్చాను. ఈ భూమ్మీద మిగిలి ఉన్న ఏకైక మనిషిని నేనే’’ అని వినిపిస్తుంది.సదరు టిక్ టాకర్ చాలా తెలివిగా ఈ వీడియో రూపొందించాడా? అనిపిస్తోంది.

దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. 2.2 మిలియన్ల మందికి పైగా చూశారు. ‘‘రోడ్డు మీద ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. కచ్చితంగా ఇది లాక్‌డౌన్‌లో తీసిన వీడియోనే అయి ఉంటుందని కొంతమంది అంటుంటే..ఇంట్లో ఖాళీగా కూర్చుని పిచ్చెక్కి ఇలాంటి వీడియోలు తీశాడేమో అని మరికొందరు..ఇంకొందరైతే..ఈ ప్రపంచంలో నువ్వే చివరి వ్యక్తివి అయితే ట్రాఫిక్‌ లైట్లు ఎలా కనిపిస్తున్నాయి? అయితే కరెంట్ బాగానే ఉందే ’’ అంటున్నారు.మరొకరైతే..రద్దీగా ఉండే ప్రదేశం నుండి ప్రత్యక్ష ప్రసారం చేయమని జేవియర్‌ను సవాలు చేసారు. దీనికి జేవియర్ .. “మీరు మేల్కొన్నప్పుడు ప్రతిదీ మారుతూ ఉంటుంది. నేను 2021, 2027 మధ్య చిక్కుకున్నాను. నేను మీ ప్రపంచానికి సమాంతరంగా ఉన్నాను అని రాసి సమాధానం ఇస్తున్నాడు. ఈ వీడియోను బార్సిలోనా హోటల్ చివరి అంతస్తు నుండి తీసినట్లుగా తెలుస్తోంది.