17లక్షల కండోమ్‌లు ఫ్రీగా పంచాం..కావాల్సినవారు పట్టుకెళ్లండి

వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లి లాక్ డౌన్ తో తిరిగి బీహార్ కు వచ్చి..క్వారంటైన్ సెంటర్ నుంచి తిరిగి వారి ఇళ్లకు వెళ్లే వలస కార్మికులకు ప్రభుత్వం తరపున 17 లక్షల కండోమ్‌లను పంపిణీ చేశామని డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి బీహార్ వచ్చి స్వీయ నిర్బంధంలో ఉన్న లక్షలాది మంది నిరక్ష రాస్యుల్లో కుటుంబ నియంత్రణ ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇటువంటి వినూత్నంగా ఈ పద్ధతిని చేపట్టామని తెలిపారు.
కుటుంబ నియంత్రణకు అవసరమైన సమాచారంతో పాటు వలస కార్మికులకు మహిళలకు గర్భ నిరోధక మాత్రలు..పురుషులకు కండోమ్‌లతో ఉన్న కిట్‌లను పంపిణీ చేశామని..14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న వలస కార్మికులకు ఇవి ప్రభుత్వం ఇచ్చిన బహుమానం అని తెలిపారు.
ఏప్రిల్ నెలలో 2.14 లక్షలు..మే లో 15.39 లక్షల గర్భనిరోధక సాధనాలకు పంపిణీ చేశామని..ఇలా మొత్తంగా 17.53 లక్షల కండోమ్‌లను వలస కార్మికులకు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇప్పటికీ ఇటువంటి గర్భ నిరోధక మాత్రలు, కండోమ్‌లు లభిస్తాయని..వాటి అవసరం ఉన్నవారెవరైనా సరే వారికి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించవచ్చని వలస కూలీలకు సుశీల్ కుమార్ మోదీ సూచించారు.
కాగా…గత దశాబ్ద కాలంగా బీహార్ లో సంతానోత్పత్తి రేటు 4.3 నుంచి 3.2కు తగ్గిందనీ..ఇలా జనాభా పెరుగుదలను నియంత్రిస్తూ బాలికా విద్య కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. జనాభా నియంత్రణలో భాగంగాప్రభుత్వం డోర్ టూ డోర్ 11 లక్షల గర్భనిరోధక సాధనాలను పంపిణీ చేయబడ్డాయి.
Read: ఏనుగులకు రూ.5కోట్ల ఆస్తి రాసిచ్చేశాడు..సగం భార్యకు సగం గజరాజులకు