Bihar Floor Test: బలపరీక్షలో నెగ్గిన బీహార్ సీఎం నితీశ్ కుమార్

తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ సభ నుంచి వాకౌట్ చేసింది. దీంతో నితీశ్ 129తో బలపరీక్షలో గెలుపొందారు.

Nitish Kumar

బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బలపరీక్షలో నెగ్గారు. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ సభ నుంచి వాకౌట్ చేసింది. దీంతో నితీశ్ సర్కారు 129తో బలపరీక్షలో గెలుపొందింది.

బిహార్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 243. బలపరీక్ష నెగ్గడానికి కావాల్సిన బలం 122. అసెంబ్లీలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. తాను ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను ఆర్జేడీ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. తాను సీఎం కాకముందు అప్పట్లో 15 ఏళ్లుగా పనిచేసిన లాలూ ప్రసాద్-రబ్రీ దేవి ప్రభుత్వాలు బిహార్ అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆరోపించారు.

బిహార్‌లో ఇటీవలే ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. నితీశ్ కుమార్ తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. నితీశ్ సహా 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఆర్జేడీకి హ్యాండ్ ఇచ్చి నితీశ్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆయన బలపరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది.

బిహార్‌ సీఎంగా నితీశ్ ఇప్పటివరకు మొత్తం తొమ్మిదోసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్‌ 2022లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ సహకారంతో బిహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇండియా కూటమిలోనూ కీలకపాత్ర పోషిస్తారనుకుంటే ముందు అందులో బాగానే పనిచేసి ఆ తర్వాత తన దారి తాను చూసుకున్నారు.ఇండియా సమావేశంలో ఆ కూటమి కన్వీనర్‌గా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించడంతో నితీశ్‌ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: బీఆర్ఎస్‌కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

ట్రెండింగ్ వార్తలు