Ponnam Prabhakar: బీఆర్ఎస్‌కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

తెలంగాణ హక్కుల కోసం అవసరమైతే అందరం ఢిల్లీ వెళ్లి కొట్లాడదామని పిలుపునిచ్చారు.

Ponnam Prabhakar: బీఆర్ఎస్‌కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

Ponnam Prabhakar

Updated On : February 12, 2024 / 3:37 PM IST

బీఆర్ఎస్‌కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తాము తెలంగాణ బిడ్డలమని, పార్లమెంట్లో తెలంగాణ కోసం పోరాడిన వాళ్లమని చెప్పారు. విభజన హామీల అమలు కోసం బీఆర్ఎస్ నేతలు పదేళ్లలో చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రజలు కొట్లాడారని చెప్పారు.

సీఎం కేసీఆర్ ఎన్నడూ ప్రగతి భవన్ వెళ్లిన పరిస్థితి లేదని, అక్కడకు వెళ్లడానికి తమకు కూడా అవకాశం ఇవ్వలేదని అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారికి ప్రగతి భవన్‌లో రెడ్ కార్పేట్ వేశారని విమర్శించారు. తెలంగాణ కోసం అప్పట్లో తమ నాయకుడు వైఎస్సార్ కొడుకైనా జగన్మోహన్ రెడ్డితో విభేదించామన్నారు.

కేసీఆర్ మాత్రం ఇంటికి పిలిచి ఫ్లవర్ బొకేలు ఇచ్చి, స్వాగతం పలికి తెలంగాణకి అన్యాయం చేశారని పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రాజెక్టులు కడుతుంటే తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కనీసం రెండు నెలలైనా కాలేదు అప్పుడే ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

కృష్ణ, గోదావరి నీళ్లను తెలంగాణ ప్రజలు వ్యవసాయానికి ఉపయోగించుకునే హక్కు ఉందని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం బీఆర్ఎస్ కి ఏటీఎంగా పనిచేసిందని తెలిపారు. తెలంగాణ హక్కుల కోసం అవసరమైతే అందరం ఢిల్లీ వెళ్లి కొట్లాడదామని పిలుపునిచ్చారు.

Minister RK Roja : వైఎస్ షర్మిలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి రోజా