Minister RK Roja : వైఎస్ షర్మిలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి రోజా

వైఎస్ఆర్ ఆశయాలకోసం జగన్ పనిచేస్తుంటే.. వైఎస్ఆర్ ఆస్తులకోసం షర్మిల రోడ్డెక్కి పోరాటం చేస్తోందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.

Minister RK Roja : వైఎస్ షర్మిలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి రోజా

Minister RK Roja

Updated On : February 12, 2024 / 3:43 PM IST

YS Sharmila : ఏపీ మంత్రి రోజా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదివారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రోజాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాజాగా, షర్మిల వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. షర్మిల ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. వైయస్సార్ బిడ్డనని చెప్పుకునే షర్మిల వైఎస్ కు పేరు తెచ్చే ఒక్కపని చేయలేదు. జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు వదిలిన బాణంగా షర్మిల పనిచేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : YS Sharmila: రాష్ట్రవ్యాప్త పర్యటనకు వైఎస్‌ షర్మిల.. పూర్తి వివరాలు

వైఎస్ ఆశయాలకోసం జగన్ పనిచేస్తుంటే.. వైఎస్ఆర్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డెక్కి పోరాటం చేస్తోందని రోజా ఎద్దేవా చేశారు. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టి.. అక్కడే పుట్టాను ఇక్కడే పెరిగానని చెప్పిన షర్మిల.. ఇప్పుడు ఆ పార్టీని గాలికి వదిలేసిందని, వైఎస్ ఫ్యామిలీని, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ లో చేరి జనంపై, జగనన్నపై విషం చిమ్ముతోందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన రాజన్న బిడ్డ జగన్ మాత్రమేనని, కాంగ్రెస్ లో చేరిన షర్మిల వైఎస్ ఆత్మను క్షోభించేలా చేసిందని రోజా విమర్శించారు.

Also Read : YS Sharmila: ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష.. అంతకుముందు పలువురు నేతలను కలిసి..

అవగాహన లేని షర్మిల:  వైవీ సుబ్బారెడ్డి 
వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ షర్మిల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఎంపీలు బీజేపీకి బానిసలుగా వ్యవహరిస్తున్నారని షర్మిల అవగాహన లేకుండా మాట్లాడుతోందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని షర్మిల మాట్లాడటం కాదు.. బయట తిరుగితే అభివృద్ధి కనిపిస్తుందని తెలిపారు. బీజేపీతో తెలుగుదేశం ఎప్పుడూ విడిపోలేదు. విడిపోవడం, కలుసుకోవడం చంద్రబాబుకు మామూలేనని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.