Bihar Political Crisis : క్లైమాక్స్‌కు చేరిన బీహార్ రాజకీయ పరిణామాలు.. కూలిపోనున్న బీహార్ మహాకూటమి ప్రభుత్వం

మధ్యాహ్నం 12గంటల సమయంలో నితీశ్ కుమార్ తో కలిసి బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ వెళ్తారని సమాచారం. జేడీయూ, బీజేపీ కలిసి నితీశ్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరనున్నారు.

Nitish Kumar

Bihar CM Nitish Kumar : నాటకీయ పరిణామాల మధ్య బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇవాళ బీహార్ రాజకీయాల్లో బిగ్ సండే కాబోతుంది. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో బంధాన్ని తెంచుకోవాలని జేడీయూ అధ్యక్షులు, ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ నిర్ణయించుకున్నాడు. మళ్లీ పాత మిత్రుడు బీజేపీతో జతకట్టేందుకు నితీశ్ సిద్ధమవుతున్నాడు. అయితే, ఇవాళ 10గంటలకు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేయనున్నారు. ఆ తరువాత నితీశ్ కుమార్ నివాసానికి బీజేపీ నేతలు వెళ్లనున్నారు. బీజేపీ మద్దతుతో సీఎంగా నితీశ్ సాయంత్రం 4గంటలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. నితీశ్ కుమార్ తాజా రాజకీయ నిర్ణయంతో దేశ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలకు తెరలేస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read : Sullurupeta YCP Cader: ఆ ఎమ్మెల్యే మాకు వద్దే.. వద్దు..! ఆసక్తికరంగా సూళ్లూరుపేట వైసీపీ రాజకీయం

12గంటలకు గవర్నర్ తో భేటీ..
ఉదయం 9గంటలకు బీహార్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో బీజేపీ కేంద్ర పెద్దలు సమావేశం కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటు, ఎన్డీఏలోకి జేడీయూని ఆహ్వానించడం, రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం అంశాలపై బీజేపీ నేతలు చర్చించనున్నారు. ఆ తరువాత ఉదయం 10గంటలకు జేడీయూ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఆ తరువాత 11 గంటలకు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 11.30గంటల సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు నితీశ్ నివాసానికి వెళ్లనున్నారు. నితీశ్ తో భేటీ తరువాత మధ్యాహ్నం 12గంటల సమయంలో నితీశ్ కుమార్ తో కలిసి బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ వెళ్తారని సమాచారం. అనంతరం నితీశ్ కుమార్ సీఎం పదవికి తన రాజీనామాను గవర్నర్ కు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత జేడీయూ, బీజేపీ కలిసి నితీశ్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరనున్నారు.  సాయంత్రం 4 గంటల సమయంలో బీజేపీ, జేడీయూ కూటమిలో మరోసారి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

Also Read : Nitish Kumar: చక్రం తిప్పుతున్న సీఎం నితీశ్.. మళ్లీ ఉత్కంఠ.. ఏం జరుగుతుందో తెలుసా?

లాలూ వ్యూహం ఫలిస్తుందా?
తాజా పరిణామాల నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తగినంత మెజారిటీ లేనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆర్జేడీని ఆహ్వానించాలని గవర్నర్ ను ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన కుమారుడు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సహా సీనియర్ పార్టీ నాయకులతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల సభ్యులకు అదనంగా కొంతమంది జేడీయూ ఎమ్మెల్యేలను కలుపుకొని అధికారాన్ని నిలబెట్టుకోవాలని లాలూ భావిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి బీహార్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో నితీశ్ కుమార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని, ఆ సమయంలో పదహారు మంది జేడీయూ ఎమ్మెల్యేలను గైర్హాజరయ్యేలా చేయాలని ఆర్జేడీ గేమ్ ప్లాన్ గా తెలుస్తోంది.

అయితే, 16 మంది జేడీయూ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సమాధానంగా.. వచ్చే ఏడాది వరకు బీహార్ లో నాలుగు ఎన్నికలు జరగనున్నాయి. అందులో లోక్ సభ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తరువాత వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ 16 మంది ఎమ్మెల్యేలకు ఆర్జేడీ సీటు ఆఫర్ చేయొచ్చు. అంటే కొందరిని రాజ్యసభకు పంపిస్తారని, కొందరికి లోక్ సభ టికెట్ ఇస్తారని, కొందరికి ఎమ్మెల్సీని, మరికొందరికి మంత్రి పదవులు ఇస్తారని, మరికొందరికి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల టికెట్ ఇస్తామన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, 16 మంది జేడీయూ ఎమ్మెల్యేల రాజీనామాను లాలూ, తేజస్వీలు ఎంత వరకు విజయవంతం చేస్తారనేది అతిపెద్ద ప్రశ్న. అదే జరిగితే నితీశ్ కుమార్ కు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు