బీహార్ నుంచి తీహార్ జైలుకు 10 ఉరితాళ్లు
నిర్భయ కేసులో నిందితులను ఉరి తీస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో వారిని ఉరి తీసేందుకు ఉరి తాళ్లు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం బీహార్ లోని బక్సర్ జైల్లో 10 ఉరితాళ్లు

నిర్భయ కేసులో నిందితులను ఉరి తీస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో వారిని ఉరి తీసేందుకు ఉరి తాళ్లు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం బీహార్ లోని బక్సర్ జైల్లో 10 ఉరితాళ్లు
నిర్భయ కేసులో నిందితులను త్వరలోనే ఉరి తీస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో వారిని ఉరి తీసేందుకు ఉరి తాళ్లు సిద్ధం చేస్తున్నారు జైలు అధికారులు. ఇందుకోసం బీహార్ లోని బక్సర్ జైల్లో 10 ఉరితాళ్లు తయారు చేయించారు. మెత్తని దూదితో తయారు చేసిన తాళ్లను తీహార్ జైలుకి అధికారులు పంపనున్నారు. ఉరితాళ్లను 7వేల 200 దారాలతో తయారు చేశారు. ఇందుకు 16 అడుగుల తాడు అవసరమైంది. తాళ్లను మృదువుగా ఉంచడానికి తగినంత తేమ వాడారు. ఈ 10 తాళ్లను తీహార్ జైలుకి పంపే పనిలో అధికారులు ఉన్నారు.
2012 డిసెంబర్ 16న నిర్భయ ఘటన జరిగింది. ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా, పార్లమెంటుపై దాడి కేసులో 2013లో అఫ్జల్ గురుని ఉరి తీశారు. అప్పుడు బక్సర్ జైలు నుంచే ఉరితాడు తెచ్చారు. అదే చివరి సారి. ఇప్పుడు మరోసారి 10 ఉరితాళ్లు పంపాలని బక్సర్ జైలుకు ఆదేశాలు అందాయి.
”ఉరి తాళ్లను సిద్ధం చేయాలని పాట్నాలోని జైలు ప్రధాన కార్యాలయం నుండి ఆదేశాలు వచ్చాయి” అని బక్సర్ జైలు సూపరింటెండెంట్ విజయ్ అరోరా తెలిపారు. ఒక్కో ఉరితాడు 1.5 కిలోల బరువు ఉంటుందన్నారు. ఒక్కో ఉరి తాడు తయారు చేడానికి రూ.1,120 ఖర్చవుతుందని వివరించారు. విభజనకు ముందు నుండి బక్సర్ జైలు ఉరి తాడులను తయారు చేసింది. ఇక్కడి భూమి పత్తి సాగుకు అనువుగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఈ పట్టణం గంగా నది ఒడ్డున ఉంటుంది. దాంతో నాణ్యమైన పత్తి వస్తుంది. పైగా పత్తిలో తేమ శాతం కూడా ఎక్కువ. దీంతో ఉరి తాళ్లు తయారు చేయడానికి ఇక్కడి పత్తి కరెక్ట్ గా సరిపోతుందని అధికారులు వివరించారు.
”బక్సర్ లో మంచి ఉరి తాళ్లను తయారు చేస్తారు. ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తోంది. ఈ కారణంగానే బక్సర్ తాళ్లకు ప్రాధాన్యత ఉంది. జైలు శిక్ష అనుభవిస్తున్న 10మందికి ఉరి తాళ్లను చేసే ట్రైనింగ్ ఇస్తాము. ఆ బృందమే తాళ్లను తయారు చేస్తుంది. అయితే మరణశిక్షలు తగ్గడంతో ఉరి తాళ్లకు అంతగా డిమాండ్ లేదు. అయినా మేము మా ఫ్యాక్టరీ యూనిట్‌ను నిర్వహిస్తాము. దుస్తులను తయారు చేస్తాము.” అని బక్సర్ జైలు సూపరింటెండెంట్ తెలిపారు.
”ప్రస్తుతం స్థానికంగా పత్తి ఉత్పిత్తి తగ్గింది. దీంతో ప్రభుత్వ సరఫరాదారుల నుండి J34 రకం ముడి పత్తిని సేకరిస్తున్నాం. J34 రకాన్ని ఎక్కువగా ఉత్తర భారతదేశంలో పండిస్తారు. 4.5 మందం, 29 మిమీ పొడవు ఉంటుంది. 1,800 దారాలతో.. ఒక్కొక్కటి 16 అడుగుల పొడవు గల ఉరి తాడును తయారు చేస్తాయి. ఒక్కో తాడు 150 కిలోల బరువున్న వ్యక్తి భారాన్ని మోస్తుంది.” అని బక్సర్ జైలు సూపరింటెండెంట్ తెలిపారు. స్వాతంత్ర్యానికి ముందు, ఉరి తాళ్ల తయారీ కోసం మనీలా తాడుని వాడేవారని… దీనికి కారణం దాని మృదుత్వం అని అధికారులు చెప్పారు. ముడి పత్తికి మృదుత్వం రావడం కోసం గంగా నీటిని బాయిలర్లలో ఉపయోగించేవారని.. ఇప్పుడు J34 రకం పత్తి కారణంగా ఆ అవసరం లేకుండా పోయిందన్నారు.
”ఉరి తాళ్లు తయారు చేయడం అనేది ఒక ప్రత్యేకమైన కళ. లాభం కోసం చేస్తున్నది కాదు. మిగతా వాటికన్నా పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉండటం వల్లే.. బక్సర్ ఉరి తాళ్లకి ఎక్కువ డిమాండ్ ఉంది” అని జైలు అధికారులు వివరించారు.