కొందరికి మంత్రి పదువులు ఇవ్వడం ప్రభుత్వాలకు ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే బీహార్‌లో కొత్తగా కొలువుతీరిన నితీష్ కుమార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిస్తుంది. మంత్రుల నియామకం విషయంలో మంత్రైన డాక్టర్ మేవలాల్ ఛౌదరి విషయంలో విషయంలో కూడా ఇదే జరిగింది. ఒక కార్యక్రమంలో జాతీయగీతం పాడుతూ..జనగణమన పలకలేకపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను రాష్ట్ర జనతాదళ్ ట్విట్టర్‌లో పంచుకుంది.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి జీతాయగీతం రాదు అంటూ ప్రతిపక్ష RJD ట్వీట్ చేసింది. విద్యాశాఖ మంత్రంటే.. ఎంతో విద్యావంతుడై ఉంటాడు. ఉన్నత చదువులు చదివి ఉంటాడు అని అందరూ అనుకుంటారు. కానీ ఆ మంత్రికి జాతీయ గీతం కూడా పాడడం రాదు అంటూ జనగణమన పాడడం రాక ఇబ్బందులు పడిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
https://10tv.in/encounter-in-jammu-and-kashmir-security-forces-kill-four-terrorists/
విద్యాశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మేవాలాల్ ఛౌదరి.. అంతకుముందు ఓ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జనగణమన పాడడం రాక.. నోటికొచ్చింది ఆలపిస్తూ.. నవ్వుల పాలయ్యారు. ఇక విద్యాశాఖ మంత్రిగా ఎన్నికైన ఛౌదరిపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవనీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేవాలాల్ ఛౌదరికి విద్యాశాఖ అప్పగించడంపై ట్విట్టర్లో విమర్శలు వస్తున్నాయి.
भ्रष्टाचार के अनेक मामलों के आरोपी बिहार के शिक्षा मंत्री मेवालाल चौधरी को राष्ट्रगान भी नहीं आता।
नीतीश कुमार जी शर्म बची है क्या? अंतरात्मा कहाँ डुबा दी? pic.twitter.com/vHYZ8oRUVZ
— Rashtriya Janata Dal (@RJDforIndia) November 18, 2020