Chain Snatching: కొడుకుని ట్యూషన్‌లో దింపేందుకు వెళ్లిన మహిళను తుపాకీతో బెదిరించి..
జల్సాలకు అలవాటు పడి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను, స్కూటీలపై వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని ఛైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు.

Chain Snatch
Chain Snatching: జల్సాలకు అలవాటు పడి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను, స్కూటీలపై వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని ఛైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. వాళ్లు తేరుకునేలోపే ఉడాయించడంతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి సాయం చేయమంటూ లబోదిబో అనాల్సిన పరిస్థితి.
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆకతాయిల ఆగడాలు.. సీసీటీవీ నిఘాలేని ప్రాంతాల్లోనే కాదు.. అవి ఉన్నప్పటికీ మాస్కులతో రెచ్చిపోతున్నారు. తాజాగా.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అటువంటి ఘటనే జరిగింది.
ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి.. స్కూటీ మీద వెళ్తున్న మహిళను ఆపి.. జేబులో నుంచి గన్ తీసి పాయింట్ బ్లాంక్‌లో ఉంచారు. భయంతో హడలిపోయి నిలిచిపోయిన మహిళ మెడలో చైన్ లాక్కొని పరారయ్యారు. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనను చూసి.. స్థానికులు, రోడ్డు మీద వెళ్లేవాళ్లు షాక్ అయ్యారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. కొడుకును ట్యూషన్ సెంటర్‌లో దించేందుకు.. స్కూటీ మీద వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.