చైనాకు బిపిన్ రావత్ వార్నింగ్

  • Publish Date - August 24, 2020 / 12:37 PM IST

చైనాకు భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ వార్నింగ్ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య ఇంకా సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశంపై సైనిక చర్యకు దిగేందుకైనా సిద్ధమేనని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.



లడఖ్ లో పీఎల్ఏ దళాలు దురాక్రమణకు తెగించిన అంశంపై మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సైనికాధికారుల, దౌత్యాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయని, చర్చలు విఫలమైతే..అప్పుడు సైన్యంతో సమాధానం ఇవ్వగలమన్నారు.

బోర్డర్ విషయంలో నెలకొన్న సమస్యను శాంతియుతంగా పరష్కరించుకోవాలన్నదే తమ అభిమతమన్నారు. అయితే..రక్షణ దళాలు ఎలాంటి సైనిక చర్యకు దిగేందుకైనా సిద్ధమేనని ఉంటాయని స్పష్టం చేశారు.



తూర్పు లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనా దేశం చేస్తున్న అతిక్రమణలను ఎదుర్కోవడానికి భారత సైన్యం పక్కా ప్రణాళికతో ఉన్నదన్నారు. ఆ దేశం యొక్క ఆర్మీని ఎదుర్కొనడానికి మిలటరీ యాక్షన్ ప్రతిపాదన తమ వద్ద సిద్ధంగా ఉందని, ఎల్ఐసీ వెంట యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి మాత్రం ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.

ప్రస్తుతం వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్, జాతీయ సలహాదారు అజిత్ దోవల్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారని వెల్లడించారు.



గత సంవత్సరం ఏప్రిల్ నుంచి భారత్ – చైనా సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ఆ దేశం పొట్టనపెట్టుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి.