Bird Flu
Bird Flu Kerala : భారతదేశాన్ని వైరస్ లు విడిచిపెట్టడం లేదు. పలు రాష్ట్రాల్లో కొత్త కొత్త వైరస్ లు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ సమస్య నుంచి ఇంకా బయటపడకముందే..కొత్త వేరియంట్ ఒమెక్రాన్ గడగడలాడిస్తోంది. దేశంలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా..కేరళ రాష్ట్రంలో మరోసారి బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడం ఇది రెండోసారి. అలప్పుజ జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చర్యలు చేపట్టేందుకు అధికారులు రెడీ అయిపోయారు.
Read More : Bipin Rawat Funerals : సైనిక లాంఛనాలతో బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి
అందులో భాగంగా కీలక నిర్ణయాలు ప్రకటించారు. బర్డ్ ఫ్లూ నియంత్రణ కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ లను ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఈ వైరస్ ఆనవాళ్లు గుర్తించారో…ఆ ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించారు. వాహనాలు, ప్రజల రాకపోకలపై నిషేధం విధించారు. మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు విధించారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కిలోమీటర్ పరిధిలో ఉన్న బాతులు, కోళ్లు, ఇతర పక్షులను చంపాలని నిర్ణయించారు.
Read More : Pawan Kalyan Deeksha : పవన్ కళ్యాణ్ ఒకరోజు దీక్ష
సరిహద్దు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని కేరళ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. వలస పక్షులకు వైరస్ సోకిందా ? లేదా ? నిర్ధారించాలని, నివారణ చర్యలపై రోజువారి నివేదికలు సమర్పించాలని పశుసంవర్ధక అధికారులకు సూచించారు. కేరళలోని హరిప్పడ్ మున్సిపాలిటీతో పాటు చుట్టుపక్కల దాదాపు 12 పంచాయతీల్లో నిషేధాజ్ఞలు అమలు చేసినట్లు తెలుస్తోంది.