లంచం ఇవ్వలేదని…బర్త్ సర్టిఫికెట్ లో ఇద్దరు పిల్లల వయస్సు 100ఏళ్లు

ఉత్తరప్రదేశ్ లో లంచాల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ లంచగొండుల విషయంలో కఠినంగా ప్రవర్తిస్తున్నప్పటికీ అవి ఆగడం లేదు. దీనికి ఉదాహరణ ఇద్దరు పిల్లల వయస్సు విషయంలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురిచేసింది. 

ఉత్తరప్రదేశ్ లో సాకేత్(2),సుభ్(4) అనే ఇద్దరు చిన్నారుల వయస్సును వారి బర్త్ సర్టిఫికెట్ లలో 102,104 సంవత్సరాలుగా ఉంచారు అధికారులు. దీంతో తప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తో తన మేనళ్లుళ్ల బర్త్ సర్టిఫికేట్స్ ను జారీ చేశారంటూ షహజాన్ పూర్  జిల్లాలోని బేలా గ్రామానికి చెందిన పవన్ కుమార్ బరేలీ కోర్టును ఆశ్రయించాడు. దీంతో విలేజ్ డెవలప్ మెంట్ ఆఫీసర్,గ్రామ పెద్దపై కేసు నమోదు చేయాలని ఇటీవల పోలసులను బరేలీ కోర్టు ఆదేశించింది.

రెండు నెలల క్రితం ఆన్ లైన్ లో బర్త్ సర్టిఫికెట్ కు అప్లయ్ చేసుకున్న పవన్ కుమార్ ను గ్రామ డెవలప్ మెంట్ ఆఫీసర్ సుశీల్ చంద్ అగ్నిహోత్రి,గ్రామ పెద్ద పవన్ మిశ్రాలు ఒక్కో బర్త్ సర్టిఫికెట్ కు రూ.500చొప్పున లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని, అయితే అందుకు పవన్ నిరాకరించడంతో బర్త్ సర్టిఫికెట్స్ లో తప్పుగా పుట్టిన తేదీని ఉంచారని,జనవరి17,2020న కోర్టు తీర్పు కాపీ తమకు అందిందని,తగిన చర్యలు తీసుకుంటాయని ఎస్ఎచ్ వో తెలిపారు.