CM Didi-PM Modi : దీదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మోదీ

జనవరి 5 పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మమతా బెనర్జీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'మమతా దీదీకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశారు.

CM Didi-PM Modi : జనవరి 5 పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మమతా బెనర్జీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మమతా దీదీకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. మమతా బెనర్జీని దీదీని అని ఎంతో గౌరవంగా పిలుచుకుంటారు బెంగాల్ ప్రజలు. అలా ప్రధాని మోడీ కూడా మమతాను దీదీ అని సంభోదించటం విశేషం.

దీదీ రాజకీయాల్లో ఓ ఫైర్ బ్రాండ్. ప్రధాని మోడీని కూడా విమర్శలతో చెడుగుడు ఆడేస్తారు దీదీ. అటువంటిది ఇటీవల కాలంలో వీరిద్దరు సామరస్యంగా మాట్లాడుకుంటున్న సందర్భాలు వచ్చాయి. దాంట్లో ముఖ్యంగా ప్రధాని మోడీ తల్లి హీరోబెన్ కన్నుమూసిన రోజునే తల్లిని కోల్పోయిన బాధతోనే ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా నుంచి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మమతా తల్లిని కోల్పోయిన బాధలో కూడా మీరు ఈ కార్యక్రమానికి వచ్చారు..పశ్చిమ బెంగాల్ ప్రజల తరపున మీకు ధన్యవాదాలు..మీ అమ్మ మాకు కూడా అమ్మే..మీరు ఇంత బాధలో కూడా వచ్చినందకు ధన్యవాదాలు..మీరు చాలా అలసిపోయారు రెస్ట్ తీసుకోండి అని కోరారు మమతా..దీదీ మాటలకు మోడీ చలించిపోయారు.

CM Mamata Banerjee-PM Modi : రెస్ట్ తీసుకోమన్న దీదీ .. చలించిపోయిన మోదీ

తల్లిని కోల్పోయిన ఈరోజు మీకు ఎంతో విషాదకరమైన రోజు. మీ అమ్మ మాకు కూడా అమ్మే. మీ సేవలు కొనసాగించేందుకు వీలుగా భగవంతుడు మీకు బలాన్ని ఇవ్వాలి. దయచేసి కొంత విశ్రాంతి తీసుకోండి’ అని దీదీ అన్నారు. మీ తల్లి మాకు కూడా తల్లివంటివారేనని అన్నారు దీదీ. మీ అమ్మ మాకు కూడా అమ్మేనని కొడుకుగా మీ బాధ్యతనలు నిర్వర్తించటమేకాకుండా ప్రధానిగా కూడా మీ పనిని అధికారికంగా నిర్వర్తించి అమ్మ పట్ల గౌరవం చాటుతున్నారని దయచేసి కొంత విశ్రాంతి తీసుకోండి అన్నారు దీదీ. మమతా బెనర్జీ మాటలకు ప్రధాని మోడీ చలించిపోయారు. మమతా బెనర్జీ మాట్లాడిన మాటలు ప్రధానిని కదిలించాయి.

ఈ క్రమంలో ఈరోజు మమతా బెనర్జీ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోడీ ‘మమతా దీదీకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేయటం విశేషం.కాగా రాజకీయ పరంగా మమతా బెనర్జీ ప్రధాని మోడీని కూడా విమర్శలతోను..సెటైర్లతోను విరుచుకుపడుతుంటారు. రాజకీయాల్లో ఆమె ఓఫైర్ బ్రాండ్..ఆ ఫైర్ బీజేపీ పైనా..మోడీ పైనా విరుచుకుపడటంతో ఏమాత్రం తగ్గేదేలేదన్నట్లుగానే ఉంటారు మమతా బెనర్జీ.







                                    

ట్రెండింగ్ వార్తలు