పిచ్చిలందు టాట్టూల పిచ్చి వేరయా: సీక్రెట్ టాట్టూలట.. ఎక్కడేసుకుంటున్నారో తెలుసా

పిచ్చిలందు టాట్టూల పిచ్చి వేరయా: సీక్రెట్ టాట్టూలట.. ఎక్కడేసుకుంటున్నారో తెలుసా

సీక్రెట్ పార్ట్స్ లో టాట్టూలు వేయించుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అది చర్మంపై అయితే ఓకే కానీ, కంటికి కనిపించని ప్రదేశంలోనూ పచ్చబొడిపించుకుంటున్నారంటే ఏం చెప్పాలి. ఇది పైగా ట్రెండ్ అంట. నోటి పై భాగంలో అంటే అంగట్లో కూడా టాట్టూ వేయించుకుంటున్నారు. ఇవి అన్ని టాట్టూల్లా కాదట. వేసేటప్పుడు, తర్వాత భరించడం చాలా కష్టమట.

ఈ సీక్రెట్ టాట్టూలకు చాలా కష్టం అవుతుందట. జననాంగాలపై, రొమ్ములపై, భుజాలపై, మెడలపై, చేతులపై, కాళ్లపై టాట్టూలు వేయించుకుంటే కుటుంబాల్లో తెలిసిపోతుందని అలా తెలియకుండా ఉండాలంటే ఇలానే చేయాలంటున్నారు. ఆరు సంవత్సరాలుగా ఇదే పనిలో ఉన్న సీనియర్ మాట్టో మసిని ప్రైవేట్ పార్ట్స్ పై టాట్టూ వేయడంలో ఎక్స్‌పర్ట్.

ఇప్పటివరకూ నోటిలో 10మందికి టాట్టూ వేసినట్లు చెప్పాడు. ఇది చాలా పెయిన్ ఫుల్, సెన్సిబుల్ అంటున్నాడు. సూది కొంచెం అటూఇటు అయితే గమ్స్ పైకి వెళ్లిపోతుంది.

‘ఈ టాట్టూ వేయడానికి దాదాపు 20నిమిషాల సమయం తీసుకుంటారు. అది నోటిలో వేసే సబ్జెక్ట్ ను బట్టి.. నోటి స్వభావం మీద ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఇది చాలా బాధపెట్టేలా ఉంటుందనుకుంటారు. మరీ అంత బాధాకరంగా ఉండదు కాదు కానీ, గమ్స్ మీద టాట్టూ వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అని టాట్టూ వేయించుకున్న మహిళల్లో ఒకరు అంటున్నారు.

రోజూ ఒకేలా టాట్టూలు వేయడం కంటే ఇలా స్పెషల్ టాట్టూలు వేయడాన్ని తానూ ఇష్టపడతానని అంటున్నాడు. ఇతనికి టాట్టూలు వేయడం ఎంత ఇష్టమంటే లాక్ డౌన్ టైంలో ఎవరూ లేరని అతని ఒంటి మీదనే టాట్టూలు వేసుకుంటూ ఉండేవాడట. కాలి వేలి కొనల నుంచి శరీరంలోని ప్రతి అంగుళాన్ని టాట్టూలతో నింపేసుకున్నాడు.