JP Nadda Tests Positive For Coronavirus ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని నడ్డానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు.
కోరానా లక్షణాలు స్పల్పంగా బయటపడటంతో టెస్ట్ చేయించుకున్నానని,తనకు కరోనా సోకినట్లు పరీక్షలో తేలిందని నడ్డా తెలిపారు. ప్రస్తుతం తన కండీషన్ బాగానే ఉందన్నారు. డాక్టర్ల సూచన మేరకు హోం ఐసొలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల రోజుల్లో తనను కలిసినవారందరూ తమకు తాముగా ఐసొలేట్ అయ్యి టెస్ట్ చేయించుకోవాలని నడ్డా కోరారు.
కాగా, బీజేపీ చీఫ్.. కొద్దిరోజులుగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్,వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఇటీవల నడ్డా పర్యటించారు. మరోవైపు,నడ్డా త్వరగా కోలుకోవాలని కేంద్రమంత్రులు సహా సీనియర్ బీజేపీ నేతలు,కార్యకర్తలు ఆకాంక్షించారు. గెట్ వెల్ సూన్ సార్ అంటూ నడ్డా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
మరోవైపు, భారత్ లో కరోనా కేసుల సంఖ్య 1కోటికి చేరువలో ఉండగా,మరణాల సంఖ్య 1లక్షా 43వేలు దాటింది. ఇప్పటివరకు దేశంలో 93లక్షలమంది కరోనా నుంచి కోలుకున్నారు.
कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है, डॉक्टर्स की सलाह पर होम आइसोलेशन में सभी दिशा- निर्देशो का पालन कर रहा हूँ। मेरा अनुरोध है, जो भी लोग गत कुछ दिनों में संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।
— Jagat Prakash Nadda (@JPNadda) December 13, 2020