Rajnath Singh: మీడియాపై బీజేపీ ప్రభుత్వం ఆధిపత్యం.. రాజ్‭నాథ్ సింగ్ ఏమన్నారంటే?

భావప్రకటనా స్వేచ్ఛపై దేశంలో మళ్లీ చర్చ ప్రారంభమైంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈరోజు మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తున్న వారు, అది అటల్‌జీ (మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి) ప్రభుత్వమైనా లేదా మోదీ ప్రభుత్వమైనా, తాము ఏ మీడియా సంస్థపైనా నిషేధం విధించలేదనే విషయాన్ని మర్చిపోయినట్లు ఉన్నారు. అలాగే ఎవరికీ వాక్ స్వాతంత్ర్యాన్ని కానీ, భావవ్యక్తీకరణ హక్కును కానీ తిరస్కరించలేదు

Rajnath Singh: పత్రికా స్వేచ్ఛను భారతీయ జనతా పార్టీ అణచివేస్తోందని, మీడియాపై నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందన్న ఆరోపణలను పూర్తిగా అవాస్తవమని, ఇలాంటి ఆరోపణలు చేసేవారు తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఏ మీడియా సంస్థపైనా ఎప్పుడైనా నిషేధం విధించిందో చూపించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తాము ఎప్పుడూ అలాంటి ధోరణితో వ్యవహరించలేదని, ఏ మీడియా సంస్థ గొంతును అడ్డుకోలేదని ఆయన అన్నారు. ఎవరి వాక్ స్వాతంత్య్రపు హక్కును కానీ అడ్డుకోలేదని, ఎవరినీ తక్కువ చూడలేదని ఆయన అన్నారు. వాక్‌స్వేచ్ఛను అరికట్టేందుకు 1951లో ఆర్టికల్ 19 సవరణ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించిందని, కానీ తాము అలాంటి ప్రయత్నం ఏనాడూ చేయలేదని పేర్కొన్నారు.

Mayawati: వచ్చే ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్న మాయావతి

ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ వారపత్రిక ఆదివారం నిర్వహించిన “పాంచజన్య” కాన్‌క్లేవ్‌లో రాజ్‭నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘భావప్రకటనా స్వేచ్ఛపై దేశంలో మళ్లీ చర్చ ప్రారంభమైంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈరోజు మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తున్న వారు, అది అటల్‌జీ (మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి) ప్రభుత్వమైనా లేదా మోదీ ప్రభుత్వమైనా, తాము ఏ మీడియా సంస్థపైనా నిషేధం విధించలేదనే విషయాన్ని మర్చిపోయినట్లు ఉన్నారు. అలాగే ఎవరికీ వాక్ స్వాతంత్ర్యాన్ని కానీ, భావవ్యక్తీకరణ హక్కును కానీ తిరస్కరించలేదు’’ అని అన్నారు.

Telangana Government : టీచర్లకు తెలంగాణ సర్కార్ సంక్రాంతి కానుక.. బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్

ట్రెండింగ్ వార్తలు