Telangana Government : టీచర్లకు తెలంగాణ సర్కార్ సంక్రాంతి కానుక.. బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్

ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉపాధ్యాయులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ కు కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Telangana Government : టీచర్లకు తెలంగాణ సర్కార్ సంక్రాంతి కానుక.. బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్

Telangana Govt

Telangana Government : ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉపాధ్యాయులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ కు కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో షెడ్యూల్ ను విడుదల చేయనుంది. కాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇవాళ మంత్రి హరీష్ రావు నివాసంలో ఉపాధ్యాయ సంఘాలతో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాసాటి కరుణ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపారు. ఈ భేటీలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను అనుమతించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రులు తెలిపారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు అనుమతించిన తెలంగాణ ప్రభుత్వం మరికాసేపట్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది.

Telangana Employees : ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన ఉద్యోగుల విభజన, బదిలీలు

ప్రస్తుతం తెలంగాణలో లక్షా 5 వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. 10 వేల మంది టీచర్లు ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. 2015లో చివరిసారిగా ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించారు. అప్పటినుంచి ఉపాధ్యాయులు ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 137 జీవో ప్రకారం బదిలీ అయిన ఉపాధ్యాయలకు మినహాయింపు ఇచ్చారు. దాదాపు 50 వేల మంది టీచర్లు బదిలీల కోసం వేచివున్నారు. 2018లో చివరిసారిగా ఉపాధ్యాయులను బదిలీలు చేశారు.