BJP Leader Killed : బీజేపీ నేత దారుణ హత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపారు, షాకింగ్ వీడియో

వచ్చీ రాగానే అతడిపై గన్ తో కాల్పులు జరిపారు. అంతే, తీవ్ర గాయాలతో బీజేపీ నేత స్పాట్ లోనే మరణించాడు. BJP Leader Killed-Uttar Pradesh

BJP Leader Killed-Uttar Pradesh (Photo : Google)

BJP Leader Killed-Uttar Pradesh : దేశంలో క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. నేరాలు, ఘోరాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా రౌడీలు, గూండాలు మాత్రం లెక్క చేయడం లేదు. మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయింది. నీళ్లు తాగినంత ఈజీగా ఎంతో సింపుల్ గా మర్డర్లు చేస్తున్నారు. తుపాకులతో రక్తపుటేరులు పారిస్తున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరదాబాద్ లో దారుణం జరిగింది. బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. అంతా చూస్తుండగానే నడి రోడ్డుపై దుండగులు బీజేపీ నేతను కాల్చి చంపారు.

Also Read..Cow Attacks Girl : షాకింగ్.. రెచ్చిపోయిన ఆవు, చిన్నారిపై విచక్షణారహితంగా దాడి, కుమ్మి కుమ్మి పడేసింది.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

గురువారం సాయంత్రం బీజేపీ నేత మరో వ్యక్తితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో వెనుక నుంచి బైక్ పై ముగ్గురు వ్యక్తులు వచ్చారు. బీజేపీ నేతను అడ్డగించారు. వచ్చీ రాగానే అతడిపై గన్ తో కాల్పులు జరిపారు. అంతే, తీవ్ర గాయాలతో బీజేపీ నేత స్పాట్ లోనే మరణించాడు. హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మృతుడి పేరు అనూజ్ చౌదరి(34). అతడు బీజేపీ నాయకుడు. గురువారం సాయంత్రం అనూజ్ చౌదరి మరో వ్యక్తితో కలిసి తన ఇంటి బయటే రోడ్డుపై నడుస్తున్నాడు. ఇంతలో సడెన్ గా ముగ్గురు వ్యక్తులు వెనుక నుంచి బైక్ పై వచ్చారు. వచ్చీ రాగానే అనూజ్ చౌదరిపై గన్ తో కాల్పులు జరిపారు. దాంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతడి చనిపోయినప్పటికీ.. దుండగులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఇంకా బతికే ఉన్నాడేమో అనే అనుమానంతో పలుమార్లు గన్ తో అతి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. పట్టపగలు అంతా చూస్తుండగానే ఈ హత్య జరిగింది. అతడిని చంపాక దుండగులు అక్కడి నుంచి పరార్ అయ్యారు.

Also Read..Phone Snatch : రోడ్డు మీద చేతిలో ఫోన్ పట్టుకుని నిల్చున్నారా? అయితే బీకేర్‌ఫుల్.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి

ఒక వ్యక్తి బైక్ పైనే ఉండగా.. మరో ఇద్దరు గన్ తో కాల్పులు జరిపారు. ఈ ఊహించని ఘటనతో అప్పటివరకు అనూజ్ చౌదరి పక్కనే ఉన్న వ్యక్తి ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయాడు. దుండగులు అతడికి కూడా వదల్లేదు. అతడిపైనా కాల్పులు జరిపినట్లు వీడియోలో ఉంది. అంతా చూస్తుండగానే అదీ ఇంటి బయటే అనూజ్ చౌదరిని హత్య చేయడం తీవ్ర కలకలం రేపింది.

ఈ మర్డర్ కు రాజకీయ కక్షలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమిత్ చౌదరి, అంకిత్ అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అనూజ్ చౌదరి హత్య వెనుక వీరి ప్రమేయం ఉండొచ్చని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు.