Cow Attacks Girl : షాకింగ్.. రెచ్చిపోయిన ఆవు, చిన్నారిపై విచక్షణారహితంగా దాడి, కుమ్మి కుమ్మి పడేసింది.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

చుట్టూ ఉన్నవారు అడ్డుకునేందుకు యత్నించినా.. ఆవు మాత్రం తగ్గలేదు. చిన్నారిపై దాడిని ఆపలేదు. Cow Attacks Girl- Chennai

Cow Attacks Girl : షాకింగ్.. రెచ్చిపోయిన ఆవు, చిన్నారిపై విచక్షణారహితంగా దాడి, కుమ్మి కుమ్మి పడేసింది.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

Cow Attacks Girl (Photo : Google)

Cow Attacks Girl – Chennai : ఇన్నాళ్లూ వీధి కుక్కులే అనుకున్నాం. ఇప్పుడు వాటి జతలో ఎద్దులు, ఆవులు కూడా చేరాయి. రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తూ దాడులతో హడలెత్తిస్తున్నాయి. కుక్కల తరహాలోనే పశువులు కూడా రెచ్చిపోతున్నాయి. రోడ్డుపై ఒంటరిగా కనిపిస్తే చాలు రౌండప్ చేసి అటాక్ చేస్తున్నాయి. కొమ్ములతో కుమ్మి కుమ్మి పడేస్తున్నాయి. తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీస్తున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కుక్కలు, ఆవులు, ఎద్దుల దాడులు వెలుగుచూస్తున్నాయి. దీంతో రోడ్డుపైకి వెళ్లాలంటేనే భయపడిపోయే పరిస్థితి వచ్చింది.

ఇటీవల కాలంలో రోడ్లపై వెళ్లేవారిపై జంతువులు దాడులకు పాల్పడుతూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. వీధి కుక్కలు ఏ విధంగా దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయో చూస్తున్నాం. తాజాగా చెన్నైలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. రోడ్డుపై ఆవు రెచ్చిపోయింది. తొమ్మిదేళ్ల చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేసింది. కొమ్ములతో కుమ్మి కుమ్మి పెట్టింది. తీవ్రంగా గాయపరిచింది.

చుట్టూ చేరిన జనం అడ్డుకునేందుకు యత్నించినా, రాళ్లు కర్రలతో కొట్టినా.. ఆవు మాత్రం తగ్గలేదు. చిన్నారిపై దాడిని ఆపలేదు. కొమ్ములతో ఆ పాపను చాలాసేపు పొడుస్తూనే ఉంది. చివరికి జనం ఎక్కువ కావడంతో ఆవు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆవు ఎంత కోపంగా ఉందంటే.. అక్కడున్న జనాలు దాని దగ్గరికి వెళ్లడానికి కూడా సాహసం చెయ్యలేదు. ఇద్దరు ముగ్గురు ఆవుని అడ్డుకునేందుకు దగ్గరగా వెళ్లినా.. ఆ ఆవు వారిపై దాడి చేసేందుకు వచ్చింది. దాంతో వారు అక్కడి నుంచి పరుగులు తీశారు.

Also Read..Dogs Bulls Attack : వామ్మో.. రెచ్చిపోయిన వీధి కుక్కలు, ఎద్దు.. ఎలా దాడి చేశాయో చూడండి.. షాకింగ్ వీడియోలు

రోడ్డు మీద రెండు ఆవులు వెళ్తున్నాయి. వారి వెనుకే ఓ చిన్నారి వచ్చింది. ఆ పాప తన తల్లి, తమ్ముడితో కలిసి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తోంది. ఆమె వెనుకే తల్లి, తమ్ముడు నడుస్తున్నారు. ఇంతలో బాబు ఆవులను చూస్తూ ఏదో శబ్దం చేశాడు. అంతే, ఆవుకి ఒక్కసారిగా కోపం వచ్చింది. వెనక్కి తిరిగి బాలికపై దాడి చేసింది. కొమ్ములతో ఎత్తి పడేసింది. ఆ తర్వాత కుమ్మడం స్టార్ట్ చేసింది. సడెన్ గా వెనక్కి తిరిగిన ఆవు ఊహించని రీతిలో దాడి చేయడంతో బాలిక తల్లి, పాప తమ్ముడు భయంతో వణికిపోయారు.

తన కూతురిని కాపాడుకునేందుకు ఆ తల్లి బిగ్గరగా కేకలు వేసింది. ఆవుని అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. చేతికి అందిన రాళ్లు విసిరింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇంతలో ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. చేతికి దొరికిన రాళ్లు, కర్రలతో ఆవుపై విసిరారు. అయినా ఆవు తగ్గలేదు. దాడి చేస్తూనే ఉంది. చుట్టూ చేరిన జనం బిగ్గరగా అరుస్తూ కర్రలతో కొట్టడంతో చివరికి ఆ ఆవు అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ షాకింగ్ ఘటన బుధవారం ఎంఎండీఏ కాలనీలోని ఇల్లాంగ్ స్ట్రీట్ లో జరిగింది.

ఆవు దాడిని కళ్లారా చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. రోడ్లపై వీధి కుక్కలు, పశువుల దాడులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్డుపైకి రావాలంటేనే వణికిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ కుక్క వచ్చి దాడి చేస్తుందోనని, ఏ ఎద్దు పొడుస్తుందోనని హడలిపోతున్నారు. కాగా, ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించాలని రోడ్లపై ఇలా పశువులు విచ్చలవిడిగా తిరక్కుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, పశువులను ఇలా ఇష్టానుసారంగా రోడ్లపైకి వదులుతున్న వాటి యజమానులను కఠినంగా శిక్షించాలంటున్నారు.

Also Read..Car Explodes : బాబోయ్.. బాంబులా పేలిపోయిన కారు, ఒకరి మృతి, ఇంట్లో పార్కింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం.. అసలేం జరిగింది?

ఆవు దాడి ఘటనపై చెన్నై కార్పొరేషన్ అధికారులు స్పందించారు. రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న పశువులను స్వాధీనం చేసుకుని వాటి యజమానులపై జరిమానాలు విధించే ప్రయత్నాలను పటిష్టం చేస్తామని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. పశువులు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే ఊరుకునేది లేదని, వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.