Phone Snatch : రోడ్డు మీద చేతిలో ఫోన్ పట్టుకుని నిల్చున్నారా? అయితే బీకేర్‌ఫుల్.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి

వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో రోడ్డుపై నిల్చుంది. ఆమె చేతిలో ఫోన్ ఉంది. ఇంతలో దారుణం జరిగిపోయింది. Phone Snatch - Bengaluru

Phone Snatch : రోడ్డు మీద చేతిలో ఫోన్ పట్టుకుని నిల్చున్నారా? అయితే బీకేర్‌ఫుల్.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి

Phone Snatch - Bengaluru (Photo : Google)

Phone Snatch – Bengaluru : చేతిలో ఫోన్ పట్టుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారా? రోడ్డుపై నిల్చుని ఫోన్ చూసుకుంటున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. లేదంటే రెప్పపాటులో ఘోరం జరిగిపోవచ్చు. మీ ఫోన్ ను ఎవరైనా లాక్కుని వెళ్లొచ్చు. అవును.. ఇలాంటి షాకింగ్ ఘటన ఒకటి బెంగళూరులో జరిగింది. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు యువతి చేతిలో నుంచి ఫోన్ లాక్కుని పారిపోయారు.

బెంగళూరులోని మినీ బజార్ ప్రాంతంలోని బనస్ వాడి రైల్వే స్టేషన్ సమీపంలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. క్రాస్ రోడ్ లోకి వచ్చింది. అక్కడ వాహనాలు రద్దీ ఎక్కువగా ఉంది. రోడ్డు దాటే ప్రయత్నంలో ఆమె ఉంది. అయితే వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో రోడ్డుపై నిల్చుంది. ఆమె చేతిలో ఫోన్ ఉంది. ఇంతలో దారుణం జరిగిపోయింది.

Also Read..Hyderabad : మెక్సికో పార్సిల్, అమెజాన్ ఆర్డర్ పేర్లతో భయపెట్టి డబ్బు దోచేస్తారు.. హైదరాబాద్‌లో ఘరానా మోసం, పోలీసుల అదుపులో కన్నింగ్ గాళ్లు

బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు.. యువతి చేతిలో నుంచి ఫోన్ లాక్కుని పరారయ్యారు. ఊహించని ఈ పరిణామంతో ఆమె షాక్ కి గురైంది. ఆ వెంటనే తేరుకుని దొంగల వెంట పడింది. కానీ లాభం లేకపోయింది. ఆ దొంగలు బైక్ పై వేగంగా వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా బైక్ పై వచ్చిన దొంగలు.. పక్కా ప్లాన్ ప్రకారమే యువతి చేతిలో నుంచి ఫోన్ లాక్కెళ్లారు. యువతి ఒంటరిగా ఉంది. చేతిలో ఫోన్ పట్టుకుని రోడ్డుపై నిల్చుని ఉండటాన్ని గమనించారు. అదను చూసి ఫోన్ లాక్కెళ్లిపోయారు.

Also Read..Cow Attacks Girl : షాకింగ్.. రెచ్చిపోయిన ఆవు, చిన్నారిపై విచక్షణారహితంగా దాడి, కుమ్మి కుమ్మి పడేసింది.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తమ కళ్ల ముందు జరిగిన చోరీని చూసినోళ్లు నివ్వెరపోయారు. యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ సందర్భంగా ప్రజలకు హెచ్చరిక చేశారు పోలీసులు. రోడ్డు మీద వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చేతిలో ఫోన్ పట్టుకుని రోడ్లపై నడవం, లేదా నిల్చోవడం వంటివి చేయొద్దన్నారు. తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఓ కంట కనిపెట్టుకుని ఉండాలన్నారు.