Hyderabad : మెక్సికో పార్సిల్, అమెజాన్ ఆర్డర్ పేర్లతో భయపెట్టి డబ్బు దోచేస్తారు.. హైదరాబాద్‌లో ఘరానా మోసం, పోలీసుల అదుపులో కన్నింగ్ గాళ్లు

అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యిందని బ్లాక్ మెయిల్ చేస్తారు. మీరు నిర్దోషులుగా ప్రూవ్ చేసుకోవాలంటే యూస్ మార్షల్ తో మాట్లాడమని చెప్తారు. Hyderabad - Cheating

Hyderabad : మెక్సికో పార్సిల్, అమెజాన్ ఆర్డర్ పేర్లతో భయపెట్టి డబ్బు దోచేస్తారు.. హైదరాబాద్‌లో ఘరానా మోసం, పోలీసుల అదుపులో కన్నింగ్ గాళ్లు

Hyderabad - Cheating (Photo : Google)

Hyderabad – Cheating : కన్నింగ్ గాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. హైటెక్ పద్ధతిలో చీటింగ్ చేస్తున్నారు. పార్సిల్ పేరుతో భయపెడతారు. అమెజాన్ ఆర్డర్ పేరుతో మాయ చేస్తారు. ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు దోచుకుంటున్నారు. ఇలాంటి ఘరానా మోసం ఒకటి హైదరాబాద్ లో వెలుగుచూసింది. పోలీసులు కన్నింగ్ గాళ్లకు చెక్ చెప్పారు. అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. అసలు వాళ్లు ఎలా మోసం చేస్తారు? ఏ విధంగా ప్రజల డబ్బు దోచేస్తారు? ఈ వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.

రెండు కంపెనీలు నాలుగు ప్లేసుల్లో ఫేక్ కాల్ సెంటర్స్ పెట్టుకున్నాయి. Arg సొల్యూషన్ పేరుతో అన్సారీ అనే వ్యక్తి ఇది నడుపుతున్నాడు. దాని పక్కనే AG సొల్యూషన్ పేరుతో మరో కాల్ సెంటర్ నడుపుతున్నారు. ఈ కంపెనీలు గుజరాత్ లో రిజిస్టర్ అయ్యాయి. నిందితులు కూడా గుజరాత్ వాసులే. మొత్తం రెండు కేసులు నమోదు చేశాం. మొదటి కేసులో యూస్, కెనడా సిటిజన్స్ డేటా సంపాదించి కాల్స్ చేసి స్కాం చేస్తున్నారు. మెక్సికో నుంచి మీకు పార్సిల్ వచ్చిందని, అందులో డ్రగ్స్ ఉన్నాయని భయపెట్టి వాళ్ళ బ్యాంకు డీటైల్, ఇతర వివరాలు సేకరిస్తారు.

Cow Attacks Girl : షాకింగ్.. రెచ్చిపోయిన ఆవు, చిన్నారిపై విచక్షణారహితంగా దాడి, కుమ్మి కుమ్మి పడేసింది.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

మీరు లేనపుడు మీ ఇంటిపై కూడా రైడ్ చేశామని డ్రగ్స్ సంబంధించిన ఆధారాలు దొరికాయని భయపెడతారు. యూస్ పోలీసులు మీపై రెండు కేసులు పెడుతున్నాం అని బ్లాక్ మెయిల్ చేస్తారు. యూస్ మార్షల్ గా మాట్లాడి 5 నుంచి 6 వేల యూస్ డాలర్స్ కడితే సరిపోతుందని వసూలు చేస్తారు. అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యిందని బ్లాక్ మెయిల్ చేస్తారు. మీరు నిర్దోషులుగా ప్రూవ్ చేసుకోవాలంటే యూస్ మార్షల్ తో మాట్లాడమని చెప్తారు. అలా దోచుకున్న డబ్బంతా బిట్ కాయిన్ రూపంలో ఇక్కడికి తీసుకొస్తారు.

మరో కేసులో వెర్టెజ్ సొల్యూషన్ పేరుతో ఫేక్ అమెజాన్ కాల్ సెంటర్ ముఠా గుట్టు రట్టు చేశాం. మీ పేరుపై అమెజాన్ డెలివరీ వచ్చిందని మాట్లాడతారు. కస్టమర్.. ఆర్డర్ చేయలేదని చెబితే చెక్ చేసినట్టు నటించి మీరే చేశారని మళ్ళీ చెబుతారు. ఆర్డర్ క్యాన్సిల్ చేయాలంటే మీ బ్యాంకు నుంచి పేమెంట్ అపాలని చెప్తారు. బ్యాంకు వాళ్ళలా మాట్లాడి పేమెంట్ ఆపాలంటే కొంత ఫైన్ పడుతుందని చెప్తారు. గిఫ్ట్ కార్డు కొనాలంటూ పేమెంట్ వసూలు చేస్తారు. ఆ డబ్బుని బిట్ కాయిన్ రూపంలో మార్చి ఇండియాకి తీసుకొస్తున్నారు. మొత్తం 120 మందిని అరెస్ట్ చేశాం. ఆ కాల్ సెంటర్స్ లో పని చేసే అందరికీ ఇది ఫేక్ కాల్ సెంటర్ అని తెలుసు” అని సీపీ స్టీఫెన్ రవీంద్ర కేసు వివరాలు వెల్లడించారు.

Also Read..Teacher Thrashed : ప్రభుత్వ పాఠశాల టీచర్‌ను చెప్పులతో దారుణంగా కొట్టిన పేరెంట్స్, ఎందుకో తెలుసా