Teacher Thrashed : ప్రభుత్వ పాఠశాల టీచర్‌ను చెప్పులతో దారుణంగా కొట్టిన పేరెంట్స్, ఎందుకో తెలుసా

విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. వారిలో కోపం కట్టలు తెంచుకుంది. Teacher Thrashed - Tamil Nadu

Teacher Thrashed : ప్రభుత్వ పాఠశాల టీచర్‌ను చెప్పులతో దారుణంగా కొట్టిన పేరెంట్స్, ఎందుకో తెలుసా

Teacher Thrashed - Tamil Nadu(Photo : Google)

Updated On : August 11, 2023 / 1:02 AM IST

Teacher Thrashed – Tamil Nadu : తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాల టీచర్ పై విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు దాడి చేశారు. చెప్పులతో దారుణంగా కొట్టారు. స్కూల్ లో రచ్చ రచ్చ చేశారు. అసలేం జరిగిందంటే.. 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆ టీచర్ తీవ్రంగా కొట్టాడని అంతే కాకుండా ఆ విషయాన్ని బయటకు చెబితే స్కూల్ నుంచి వెళ్లగొడతానని భయపెట్టాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు.

హరిహరన్ అనే విద్యార్థి గురువరజన్ కండిగ ప్రభుత్వ పాఠశాలలో 6వ క్లాస్ చదువుతున్నాడు. సోమవారం అతడు స్కూల్ నుంచి ఇంటికి బాగా లేటుగా వెళ్లాడు. రాత్రి 8గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అయితే, అతడి కాళ్లు చేతులు వాపులు వచ్చాయి. అసలే స్కూల్ నుంచి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. పైగా కాళ్లు, చేతులు బాగా వాచి ఉన్నాయి. దీంతో హరిహరన్ తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థం కాలేదు.

Also Read..Car Explodes : బాబోయ్.. బాంబులా పేలిపోయిన కారు, ఒకరి మృతి, ఇంట్లో పార్కింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం.. అసలేం జరిగింది?

విషయం తెలుసుకునేందుకు హరిహరన్ తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ దగ్గరికి వెళ్లారు. పిల్లాడి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిసినా.. డాక్టర్ కు చూపించలేదని వాపోయారు. కనీసం, ఇంటికి త్వరగా పంపించకుండా స్కూల్ లోనే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని గురించి వారు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. అప్పులు వారికి అసలు విషయం తెలిసింది. స్కూల్ లో తాత్కాలిక టీచర్ గా పని చేస్తున్న మోహన్ బాబు.. హరిహరన్ ను కొట్టాడనే విషయం వెలుగుచూసింది. అంతేకాదు.. ఈ విషయం ఎవరికైనా చెబితే స్కూల్ నుంచి వెళ్లగొడతానని భయపెట్టాడట.

ఈ విషయం తెలియడంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. వారిలో కోపం కట్టలు తెంచుకుంది. చిన్న పిల్లాడితో ఇంత అమానుషంగా వ్యవహరిస్తారా అంటూ.. ఆ టీచర్ తో గొడవకు దిగారు. ఇతర టీచర్లు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన వారు వినిపించుకోలేదు. ఆ టీచర్ పై విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు దాడికి దిగారు. చెప్పులతో తీవ్రంగా కొట్టారు.

విద్యార్థిని కొట్టిన విషయమై స్కూల్ ప్రిన్సిపాల్ విచారణ చేపట్టారు. మోహన్ బాబుని పిలిపించి మాట్లాడుతున్నారు. ఇంతలో విద్యార్థి బంధువులు ఆ టీచర్ ను చుట్టుముట్టారు. అప్పటికే చాలా కోపంగా ఉన్న వారు ఆ టీచర్ ను దారుణంగా చెప్పులతో కొట్టారు. మోహన్ బాబుపై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా.. ఇంత దారుణంగా కొడతావా అంటూ టీచర్ పై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. గుంపు చెదరగొట్టారు. టీచర్ ను అదుపులోకి తీసుకుని దర్యాఫ్తు చేపట్టారు.