Muralidhara Rao : ప్రధాని పర్యటనలో భద్రతా లోపం ఘటన కుట్రే : మురళీధరరావు

ప్రధాని మోడీకి పంజాబ్ సీఎం, డీజీపీ, సీఎస్ ఎందుకు స్వాగతం పలకలేదని ప్రశ్నించారు. పాకిస్తాన్ సరిహద్దుకు ఫిరోజ్ పూర్ 10 కి.మీ దూరంలో మాత్రమే ఉంటుందని తెలిపారు.

PM Modi’s visit to Punjab a conspiracy : పంజాబ్ లో ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా లోపం ఘటన కుట్రేనని బీజేపీ నేత మురళీధరరావు అన్నారు. ప్రధాని భద్రతపై పంజాబ్ సీఎం, కాంగ్రెస్ నాయకత్వం రాజకీయం చేయడం తగదని హితవుపలికారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని..మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.

ప్రధాని మోడీకి పంజాబ్ సీఎం, డీజీపీ, సీఎస్ ఎందుకు స్వాగతం పలకలేదని ప్రశ్నించారు. పాకిస్తాన్ సరిహద్దుకు ఫిరోజ్ పూర్ 10 కి.మీ దూరంలో మాత్రమే ఉంటుందని తెలిపారు. మోదీ భారతదేశానికి ప్రధాని అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ప్రధాని మోదీ భద్రత అత్యంత ప్రధానమైనదని చెప్పారు.

Stock Markets : లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ప్రధాని మోడీ భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతోంది. ఈ మేరకు ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు ధర్మాసనం వెల్లడించింది. సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రతిపాదించింది. ఈ కమిటీలో చండీఘడ్ డీజీపీ, ఎన్ఐఏ ఐజీ, రిజిస్ట్రార్ జనరల్, ఐబీ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఉండనున్నారు.

ప్రధాని పంజాబ్ ప్రయాణ రికార్డులను భద్రపరచాలని ఇప్పటికే చండీఘడ్ హైకోర్టు రిజిస్టార్ జనరల్ ను ఆదేశించింది. ప్రధాని భద్రతా వైఫల్యంపై ఇప్పటికే దర్యాప్తు కమిటీలు కేంద్ర హోం శాఖ, పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2022, జనవరి 10వ తేదీ సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన విచారణలో పంజాబ్ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

Fire Broke Out : సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం

క్రమశికణా చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ తమ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారని, కేంద్రం చేస్తున్న దర్యాప్తుపై తమకు విశ్వాసం లేదని, స్వతంత్య దర్యాప్తు కోరుతున్నామని కోర్టు దృష్టికి పంజాబ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (SPG) నిబంధనలకు సంబంధించి బ్లూ బుక్ వివరాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు ముందట పెట్టారు. నిబంధనలన్నింటిని తు.చ తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత పంజాబ్ డీజీపీదే అని తుషార్ మెహతా వెల్లడించారు.

ప్రధాని మోడీ కాన్వాయ్ ఆగిన ప్రదేశానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే నిరసన కారులు ఉన్నారనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఉదయం నుండే అక్కడ గుంపులు గుంపులుగా ఉన్నా..ఆ విషయాన్ని డీజీపీకి తెలియపరచలేదన్నారు. ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఉందన్న ఆయన ఇంటెలిజెన్స్ ఐజీదే బాధ్యత అని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు