Stock Markets : లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ 533.15 పాయింట్ల వద్ద పెరిగి 61,150 వద్ద ముగిసింది. నిఫ్టీ 156.50 పాయింట్ల వద్ద పెరిగి 18,212.30 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 285 పాయింట్లు లాభపడింది.

Stock Markets : లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock

Stock markets with gains : నూతన సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో బాటలో సాగుతున్నాయి. ఇవాళ కూడా సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఇవాళ కూడా అదే జోరును కొనసాగించాయి. అమెరికా, ఆసియా మార్కెట్లు రాణించడంతో సూచీల జోరు ఏమాత్రం తగ్గలేదు.

అంతేకాకుండా, ఇవాళ టాప్‌ ఐటీ కంపెనీలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో ఫలితాలు వెలువడనుండడం మదుపర్లలో ఉత్సాహం నిండింది. ఆటో, రియాల్టీ, మెటల్, పవర్ స్టాక్స్ రాణించడంతో సూచీలు లాభాలతో ముగిశాయి. స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 533.15 పాయింట్ల వద్ద పెరిగి 61,150 వద్ద ముగిసింది. నిఫ్టీ 156.50 పాయింట్ల వద్ద పెరిగి 18,212.30 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 285 పాయింట్లు లాభపడింది.

Fire Broke Out : సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం
ఇవాళ నిఫ్టీలో భారతి ఎయిర్ టెల్, ఎమ్ ఆండ్ ఎమ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఓఎన్‌జీసీల షేర్లు రాణించగా.., టైటాన్ కంపెనీ, టీసీఎస్, శ్రీ సిమెంట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సీప్లా షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.7-1 శాతానికి పెరిగాయి. మెటల్, పవర్, ఆటో, ఆయిల్ ఆండ్ గ్యాస్, రియాల్టీ రంగాలు 1-2 శాతానికి పెరిగాయి.