Wrestlers Protest: నేను నేరస్థుడిని కాదు.. రాజీనామా చేయను.. ఎఫ్ఐఆర్‌‌లు నమోదుపై స్పందించిన బ్రిజ్ భూషణ్ సింగ్

పదవి నుంచి నన్ను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, నా పదవీ కాలం దాదాపు ముగిసింది. ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 45 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల తరువాత నా పదవీకాలం ముగుస్తుందని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు.

Wrestlers Protest: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్ల వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అతనిపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ సందర్భంగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ.. ఎఫ్ఐఆర్ కాపీ తనకు ఇంకా అందలేదన్నారు. మహిళా రెజ్లర్ల ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, ప్రజాశక్తి వల్లే నాకు పదవి వచ్చిందన్నారు. ఇది ఆటగాళ్ల సమ్మె కాదు.. నేను ఒకసాకు మాత్రమే. లక్ష్యం వేరొకటి ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రెజ్లర్ల పాత ప్రకటనలు వింటుంటే .. జనవరిలో నేను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారని, అయితే, రాజీనామా చేయడం పెద్ద విషయం కాదు, నేను రాజీనామా చేయను. రాజీనామా చేయడానికి నేను నేరస్థుడిని కాదు. ఒకవేళ నేను రాజీనామాచేస్తే రెజ్లర్ల ఆరోపణలు నేను ఒప్పుకున్నట్లవుతుంది. నేనే చేయని తప్పుకు ఎందుకు ఒప్పుకోవాలి అంటూ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.

Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళనకు మద్దతు.. ఉదయాన్నే జంతర్ మంతర్‌కు ప్రియాంక గాంధీ..

తనను పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, నా పదవీ కాలం దాదాపు ముగిసింది. ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 45 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని, ఎన్నకల తరువాత నా పదవీకాలం ముగుస్తుందని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లు రోజుకో డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ నన్ను జైలులోనే ఉండాలని అంటున్నారు. అలాంటప్పుడు లోక్ సభ సహా అన్ని పదవులకు రాజీనామా చేయాలని అంటున్నారని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.

Wrestlers Protest : జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న రెజ్లర్ల ఆందోళన.. నీరజ్ చోప్రా ట్వీట్

మహిళా రెజ్లర్లను భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ భూషణ్ శరణ్ లైంగికంగా వేదిస్తున్నాడని అగ్రశ్రేని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. భూషణ్ శరణ్‌పై చర్యలు తీసుకోవాలని, అతనిపై కేసు నమోదు చేసి, అతన్ని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు బజరంజ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ షోఘట్, ఇతరులు జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. గతంలో వీరు ఆందోళన చేపట్టగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కేంద్ర క్రీడల శాఖల మంత్రి హామీ ఇచ్చారు. అంతేకాక, విచారణకు సంబంధించిన కమిటీని కూడా నియమించారు. అప్పుడు రెజ్లర్లు ఆందోళన విరమించారు. గత వారంరోజుల క్రితం భూషణ్ శరణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని, వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు మరోసారి జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు.

YS Viveka Case : వివేకా కేసులో మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధం .. కడపకు చేరుకున్న సీబీఐ బృందం

ఇదిలాఉంటే ఏడుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు పిటీషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు విచారణ జరిపి ఢిల్లీ పోలీసులు, ఇతరులకు నోటీసులు జారీచేసింది. శుక్రవారంకు విచారణ వాయిదా వేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు జరిపిన విచారణలో బ్రిజ్ భూషణ్ సింగ్ పై కేసు నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసుల తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రుచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. వెంటనే కొద్దిగంటలకు ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఇదిలాఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ.. రెజ్లర్లు ఆందోళన విరమించలేదు. ఢిల్లీ పోలీసులపై తమకు నమ్మకం లేదని, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేసేవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రెజ్లర్లు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు