YS Viveka Case : వివేకా కేసులో మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధం .. కడపకు చేరుకున్న సీబీఐ బృందం

కడప వచ్చిన సీబీఐ అధికారులు ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఈసారి అరెస్ట్ ఎవరి వంతు? కడపకు సీబీఐ ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్సీ ముఖేష్ శర్మ కూడా ఎందుకు రానున్నారు? కడపలో ఏం జరుగుతోంది?

YS Viveka Case : వివేకా కేసులో మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధం .. కడపకు చేరుకున్న సీబీఐ బృందం

YS Viveka case CBI In Kadapa

YS Viveka Case : వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఈకేసు దర్యాప్తులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఏ క్షణాన అయినా జరగొచ్చని వార్తలు వస్తున్నా..మరోపక్క మరికొంతమంది అరెస్టుల కోసం సీబీఐ అధికారులు కడపకు చేరుకోవటం ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు చంచల్ గూడ జైలోనే ఉన్నారు. వారిని సీబీఐ పలుమార్లు విచారిస్తునే ఉంది. ఈ క్రమంలో ఇక అవినాశ్ రెడ్డి అరెస్ట్ తప్పదనిపిస్తున్న క్రమంలో కేసులో మరింత మందిని అరెస్ట్ చేయటానికి సీబీఐ బృందం కడప చేరుకోవటంతో ఎవరిని అరెస్ట్ చేస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. కడపకు సీబీఐ ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్సీ ముఖేష్ శర్మ కూడా ఉన్నట్లుగా సమాచారం.

మరి కడపకు వచ్చిన సీబీఐ అధికారులు ఎవరిని అరెస్ట్ చేస్తారు?అనేది అంత్యంత ఆసక్తికంగా మారింది. కాగా ఈకేసులో ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్న ఏ1 నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది. మే 5లోపు సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని లేదంటే అరెస్ట్ తప్పదని హెచ్చరించింది. ఈక్రమంలో ఎర్రగంగిరెడ్డి శుక్రవారం (ఏప్రిల్ 28,2023)న సీబీఐ కోర్టులో వివేకా కేసు విచారణకు హాజరయ్యారు. కానీ లొంగిపోకుండా విచారణ పూర్తి అయ్యాక తిరిగి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.

YS Sharmila : వైఎస్ వివేకాను కాదు సునీతాను చంపాలి.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే ఈ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి చెబుతున్నారు. తనను అన్యాయంగా ఈకేసులో సునీతారెడ్డి ఇరికిస్తున్నారని ఆరోపించారు. సునీతారెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి ఈ హత్యతో సంబంధముందని..భర్తను తప్పించి తనను తన తండ్రి భాస్కర్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారంటూ ఆరోపణలను కొసాగించారు. ఆస్తి కోసమే వివేకా హత్య జరిగిందని ఆ హత్య వెనుక సునీత భర్త రాజశేఖర్ రెడ్డి ఉన్నారంటూ ఆరోపించారు.

కానీ ఈ విషయాన్ని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు, వివేకా అన్న దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఘాటుగా స్పందిస్తు.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగింది అనడం అవాస్తవం అని..దాంట్లో ఇసుమంత కూడా నిజంలేదని తేల్చి చెప్పారు.నిజం లేదని తేల్చి చెప్పారు షర్మిల. వివేకా పేరు మీద అసలు ఆస్తులే లేవని షర్మిల స్పష్టం చేశారు. ఎప్పటి నుంచో అన్ని ఆస్తులు సునీత పేరు మీదనే ఉన్నాయన్నారు. వివేకాను చంపితే సునీత భర్తకు ఆస్తులు రావన్నారు. వివేకా వ్యక్తిగత జీవితం మీద తప్పుడు ఆరోపణలు చేయడం, నిందలు వేయడం కరెక్ట్ కాదన్నారు షర్మిల.

ఈక్రమంలో వివేకానందరెడ్డికి ఆస్తులు భారీగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఆస్తుల చిట్టా బయటపడింది. అవినాశ్ రెడ్డే వీటిని షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ గా రిలీజ్ చేశారనే సమాచారం. వివేకా పేరుతో మీద 90 ఎకరాల భూమి ఉందంటూ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావటం విశేషం. అలాగే 2023 జనవరిలో వివేకా కుమార్తె సునీత, వివేకా భార్య సౌభాగ్యమ్మపై రికార్డులు మార్పు జరిగినట్లుగా ఉంది. ఈక్రమంలో కడపకు సీబీఐ బృందం కావటం ఆసక్తికరంగా మారింది.