YS Sharmila : వైఎస్ వివేకాను కాదు సునీతాను చంపాలి.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila: వైఎస్ వివేకా వ్యక్తిత్వం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. కొన్ని మీడియా సంస్థలు వివేకాపై వ్యక్తిగత నిందలు వేస్తున్నాయి.

YS Sharmila : వైఎస్ వివేకాను కాదు సునీతాను చంపాలి.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila

YS Sharmila : వైఎస్ వివేకా కేసుపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగింది అనడం అవాస్తవం అన్నారు. అందులో నిజం లేదని తేల్చి చెప్పారు షర్మిల. వివేకా పేరు మీద అసలు ఆస్తులే లేవని షర్మిల స్పష్టం చేశారు. వివేకాకు సునీత ఒక్కగానొక్క కూతురు అన్న షర్మిల.. ఎప్పటి నుంచో అన్ని ఆస్తులు సునీత పేరు మీదనే ఉన్నాయన్నారు. వివేకాను చంపితే సునీత భర్తకు ఆస్తులు రావన్నారు. వివేకా వ్యక్తిగత జీవితం మీద తప్పుడు ఆరోపణలు చేయడం, నిందలు వేయడం కరెక్ట్ కాదన్నారు షర్మిల.

వివేకానంద రెడ్డి ప్రజల మనిషి అని షర్మిల అన్నారు. వివేకానంద రెడ్డి ప్రజా నాయకుడిగా పులివెందుల ప్రజలకు తెలుసు అని చెప్పారు. వివేకానంద రెడ్డి ప్రజల కోసమే పని చేశారని స్పష్టం చేశారు. మా చిన్నాన్న వివేకా పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవని వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు. చిన్నమ్మ పేరు మీద కూడా ఆస్తులు లేవన్నారు. ఆస్తులన్నీ కూతురు సునీత మీదే ఉన్నాయన్నారు.(YS Sharmila)

సునీత కు ఎలాంటి మోటివ్ లేదని చెప్పారు. చిన్నాన్న పేరు మీద ఒకటో అరా ఉన్న ఆస్తులు కూడా సునీత పిల్లల మీద విల్లు కూడా రాశారని చెప్పారు. లేని వ్యక్తిపై, తనకు తాను సంజాయిషీ ఇచ్చుకోలేని వ్యక్తిపై నిందలు వేయడం దారుణం అన్నారు. క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఘోరం అన్నారు వైఎస్ షర్మిల. ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగిందనడం అవాస్తవం అని షర్మిల తేల్చి చెప్పారు.

Also Read..AP CM Jagan: ఓ ముసలాయన అంటూ.. చంద్రబాబుపై ‘మోసపూరిత పులి’ కథ చెప్పిన జగన్‌

” వివేకా వ్యక్తిగత జీవితంపై మాట్లాడటం సరికాదు. ఆస్తుల కోసం వివేకా హత్య జరగలేదు. వివేకా ఆస్తులన్నీ సునీత పేరు మీదే ఉన్నాయి. వైఎస్ వివేకా ఒక ప్రజా నాయకుడు. వివేకా ఎలాంటి వారో మాకంటే కూడా వైఎస్ఆర్ జిల్లా ప్రజలకే బాగా తెలుసు. ప్రజల కోసం పని చేసిన వ్యక్తి వివేకానంద రెడ్డి. వివేకాను ప్రజా నాయకుడిగా మాత్రమే చూడాలి.

మా చిన్నాన్న వివేకా ఆస్తులన్నీ సునీత పేరు మీద రాశారు. మా చిన్నాన్న అరకొర ఆస్తులనూ సునీత పిల్లలకే రాశారు. వివేకా ఆస్తులన్నీ ఎప్పటి నుంచో సునీత పేరు మీదే ఉన్నాయి. ఆస్తులన్నీ సునీత పేరు మీదుంటే వేరే వారికి రాస్తారనడం అర్థమే లేదు. ఆస్తి కోసమే అయితే సునీత భర్త హత్య చేయాల్సింది సునీతను.(YS Sharmila)

Also Read..Tuni Constituency: టీడీపీ కొత్త ఎత్తులు.. జనసేనను నడిపించే నాయకుడు ఎవరు.. తునిలో వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందా?

మా చిన్నాన్న ప్రజా నాయకుడు, ప్రజల మనిషి. వివేకా నిత్యం ప్రజల కోసం పని చేసిన నాయకుడు. వివేకా గురించి మాకంటే పులివెందుల ప్రజలకు బాగా తెలుసు. వైఎస్ వివేకా వ్యక్తిత్వం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. కొన్ని మీడియా సంస్థలు వివేకాపై వ్యక్తిగత నిందలు వేస్తున్నాయి. విలువలు లేని మీడియా సంస్థలు విశ్వసనీయత కోల్పోతాయి. వ్యక్తిగత నిందలు వేసే మీడియా సంస్థల తీరును ఖండించాలి.